ETV Bharat / entertainment

యాక్టర్లే ప్రొడ్యూసర్లు! - 7 థియేటర్లలో రిలీజ్‌! కట్‌ చేస్తే నేటికీ ఈ సినిమా సూపర్‌ హిట్టే! - DAAG MOVIE SUCCESS STORY

పెట్టుబడ్డి పెట్టేందుకు ముందుకు రాని నిర్మాతలు - యాక్టర్ల సాయంతో పూర్తి! - సూపర్​ హిట్ టాక్ అందుకున్న సినిమా ఏదంటే?

DAAG MOVIE SUCCESS STORY
Cinema (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2024, 9:40 AM IST

మీకు ఎప్పుడైనా లెజెండరీ డైరెక్టర్‌, సూపర్‌ స్టార్‌ల కాంబోలో వచ్చిన పాత హిట్‌ మూవీ కనిపిస్తే? ఏమనుకుంటారు? అప్పట్లో భారీ థియేటర్లలో విడుదలై ఉంటుంది, బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించి ఉంటుందని అనుకుంటారు. అయితే కొన్ని సార్లు ఇది అన్ని సినిమాలకు వర్తించకపోవచ్చు. అవును మీ ఊహకు భిన్నంగానే అప్పట్లో ఓ సినిమా రిలీజ్‌ అయింది. అతి తక్కువ థియేటర్లలో విడుదలైనా, కూడా నేటికీ ప్రేక్షకుల మనసులో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఆ సినిమా ఏంటి? ఆ మూవీ కోసం ఏయే ప్రముఖులు కలిసి పని చేశారు? ఇప్పుడు తెలుసుకుందాం.

1973లో వచ్చిన 'దాగ్' అనే సినిమాను యశ్​ చోప్రా తెరకెక్కించారు. ఇందులో దివంగత నటుడు రాజేశ్ ఖన్నాతో పాటు అలనాటి అందాల తారలైన రాఖీ, షర్మిలా ఠాగూర్‌ నటించారు. అప్పట్లో ఈ కాంబోలో సినిమా తెరకెక్కడం పెద్ద విషయమనే చెప్పాలి. ఎందుకంటే ఆ కాలంలో వారి వారి ఫీల్డ్​లో వీరు సూపర్​ స్టార్లే. అయితే ఈ చిత్రం కేవలం 9 థియేటర్లలో మాత్రమే విడుదలైంది. మొదట్లో ఈ సినిమాపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేకపోయినా, ఆ తర్వాత ప్రజల హృదయాలను హత్తుకున్న ఈ చిత్రం కొద్ది రోజులకే క్రమ క్రమంగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

అయితే ఈ మూవీ విడుదలైన సమయంలో రాజేశ్ ఖన్నా కూడా బాక్సాఫీస్​ వద్ద తనకు ఎదురైన రెండు ఫ్లాప్‌ల దెబ్బ నుంచి నుంచి కోలుకుంటున్నాడు. అయితే ఈ సినిమా అందరి కెరీర్‌ను మార్చేస్తుందని, ఓ రేంజ్​లో సూపర్‌ హిట్‌ అవుతుందని యశ్ చోప్రా గ్రహించేందుకు కేవలం మూడు షో లే పట్టింది.

ఇదిలా ఉండగా, మొదట్లో 'దాగ్' సినిమాపై నిర్మాతలు, పంపిణీదారులు పెట్టుబడి పెట్టడానికి ఆలోచించారు. ప్రత్యేకించి అప్పుడు రాజేశ్​ ఖన్నా నటించిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆడకపోవడం కూడా దీనికి మరో కారణం. దీంతో 'దాగ్‌'పై మార్కెట్‌లో పెద్దగా అంచనాలు లేకుండా పోయింది. అందుకే కేవలం 9 థియేటర్లలో మాత్రమే విడుదలకు సిద్ధమైంది. కానీ రిలీజ్‌ రోజు సాయంత్రానికి మూవీ హిట్‌ టాక్‌ అందుకుంది. మూడు షోల తర్వాత మూవీ రేంజ్ అమాంతం మారిపోయింది.

ఇక ఈ సినిమా విజయంలో రాఖీ, షర్మిలా ఠాగూర్, రాజేశ్ ఖన్నా పాత్ర కీలకం. ఎందుకంటే తమ మార్కెట్‌ రేటు కంటే తక్కువ పారితోషికం తీసుకుని మరీ వీరు పని చేశారట. అంతే కాకుండా 'దాగ్‌' సినిమా పూర్తి చేయడానికి రాఖీ తన సొంత డబ్బులు రూ.3 లక్షలు కూడా ఇచ్చారట. అయితే 'దాగ్' ఆ తర్వాత తెలుగులో 'విచిత్ర జీవితం'గా రీమేక్‌ చేశారు. ఇది 1978లో రిలీజైంది.

డైరెక్టర్​ బడ్జెట్ కష్టాలు- కారులోనే దుస్తులు మార్చుకున్న హీరోయిన్!

21 ఏళ్లకే 75 మూవీలకు సైన్‌ - 100 ఆటోలు, 100 లారీలు కొనాలనే ప్లాన్‌! - ఈ బీటౌన్​ స్టార్ సక్సెస్ జర్నీ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.