ETV Bharat / entertainment

ఈ వారమే నాని, సమంత మూవీ రిలీజ్​ - మరో 8 సినిమాలు కూడా! - This Week Release Movies - THIS WEEK RELEASE MOVIES

This week Theatre Release Movies : కొత్త వారం మొదలైపోయింది. దీంతో ఎప్పటిలాగే పలు డిఫరెంట్​ కాన్సెప్ట్​ కొత్త సినిమాలు రిలీజ్​కు రెడీ అయ్యాయి. అవేంటంటే?

source Getty Images
This week Theatre Release Movies (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 8:16 AM IST

Updated : Jul 29, 2024, 9:10 AM IST

This week Theatre Release Movies : కొత్త వారం మొదలైపోయింది. దీంతో ఎప్పటిలాగే కొత్త సినిమాలు రిలీజ్​కు రెడీ అయిపోయాయి. యంగ్ హీరోలు నటించిన ఏకంగా తొమ్మిది సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. వీటిలో కొన్ని డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తోనూ వస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటంటే?

అల్లు శిరీశ్​ బ‌డ్డీ - దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత అల్లు శిరీశ్​ థియేటర్లలో సందడి చేయబోతున్నారు. శామ్ ఆంటోన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అడ్వెంచ‌ర‌స్‌ యాక్ష‌న్ మూవీ బడ్డీతో ఆగ‌స్ట్ 2న ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. కోలీవుడ్ అగ్ర నిర్మాత కేఈ జ్ఞాన‌వేళ్ రాజా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ప్రిషా రాజేశ్​ సింగ్, గాయ‌త్రి భ‌ర‌ద్వాజ్‌ హీరోయిన్లుగా న‌టించారు.

విజ‌య్ ఆంటోనీ తుఫాన్‌ - బిచ్చ‌గాడు ఫేమ్ విజ‌య్ ఆంటోనీ నటించిన తుఫాన్ సినిమా కూడా ఈ వారమే రాబోతుంది. శ‌ర‌త్‌కుమార్‌, స‌త్య‌రాజ్‌, మేఘా ఆకాశ్ కూడా సినిమాలో కీల‌క పాత్ర‌లు పోషించారు.

వ‌రుణ్ సందేశ్ విరాజి - నింద త‌ర్వాత వ‌రుణ్ సందేశ్ నటించిన చిత్రం విరాజి. ఇందులో వ‌రుణ్ సరి కొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నారు. సుకుమార్ శిష్యుడు ఆద్యంత్ హ‌ర్ష ద‌ర్శ‌క‌త్వం వహించారు. ఆగస్ట్ 2నే ఇది రానుంది. అనుకోకుండా మూత‌ప‌డిపోయిన పిచ్చి ఆస్పత్రిలో అడుగుపెట్టిన కొంత‌మంది స్నేహితుల‌కు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి? అన్నదే ఈ చిత్రం కథ.

విజ‌య్ భాస్క‌ర్ ఉషా ప‌రిణ‌యం - నువ్వు నాకు న‌చ్చావ్‌, నువ్వే కావాలి ఫేమ్ విజ‌య్ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఉషా ప‌రిణ‌యం ఆగ‌స్ట్ 2నే థియేట‌ర్ల‌లో విడుదల అవుతోంది. విజ‌య్ భాస్క‌ర్ త‌న‌యుడు శ్రీక‌మ‌ల్ హీరోగా నటించాడు. తాన్వి ఆకాంక్ష హీరోయిన్.

శివంభ‌జే - అశ్విన్‌బాబు నటించిన శివం భ‌జే గురువారమే ఆగ‌స్ట్ 1న‌ రిలీజ్ కానుంది. డివైన్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా రానున్న ఈ చిత్రానికి ఆఫ్స‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌ల్మాన్ ఖాన్ సోద‌రుడు అర్భాజ్ ఖాన్ విల‌న్‌గా నటించారు. హైప‌ర్ ఆది, ముర‌ళీశ‌ర్మ కీల‌క పాత్ర‌లు పోషించారు.

ఈ చిత్రాలతో పాటే యావ‌రేజ్ స్టూడెంట్ నాని, అల‌నాటి రామ‌చంద్రుడు, లారి సినిమాలు ఈ శుక్ర‌వార‌మే థియేట‌ర్ల‌లో విడుదల అవుతున్నాయి. ఇంకా నాని, స‌మంత జంట‌గా న‌టించిన ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు మూవీ ఆగ‌స్ట్ 2నే థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కానుంది.

పుష్ప ఈజ్​ బ్యాక్​ - షూటింగ్ ఇప్పుడు ఎక్కడ జరుగుతోందంటే?

ఐశ్వర్యారాయ్ దగ్గరున్న 5 లగ్జరీ కార్లు, ఖరీదైన వస్తువులు ఇవే- ఈమె ఆస్తి ఎన్ని కోట్లంటే? - Aishwarya Rai Net Worth

Last Updated : Jul 29, 2024, 9:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.