This Week OTT Releases : మరో వీకెండ్ వచ్చేసింది. ఈ శుక్రవారం థియేటర్లలో పలు సినిమాలు వచ్చేసి సందడి చేస్తున్నాయి. హాస్య నటుడు అల్లరి నరేశ్ ఆ ఒక్కటీ అడక్కు, యంగ్ ప్రామిసింగ్ హీరో సుహాస్ ప్రసన్నవదనం, జితేందర్ రెడ్డి. తమన్నా,రాశి ఖన్నా నటించిన బాక్(అరణ్మనై-4), వరలక్ష్మీ శరత్ కుమార్ శబరి సహా పలు చిత్రాలు వచ్చేశాయి. ఇవన్నీ మొదటి షోకే పర్వాలేదనిపించే టాక్‌ను అందుకున్నాయి. ఇదే సమయంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్, జియో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోకి కూాడా పలు చిత్రాలు స్ట్రీమింగ్‌కు అందుబాటులో వచ్చేశాయి. మొత్తంగా పది సినిమాల వరకు వస్తున్నాయి. ఈ వారాంతంలో సూపర్ హిట్ అజయ్ దేవగణ్ సైతాన్, మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ మంజుమ్మెల్ బాయ్స్‌తో పాటు పలు ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయాయి. మరీ మీరు ఈ వీకెండ్‌లో ఏఏ సినిమా చూడాలనుకుంటున్నారో ఇక్కడ ఓ లుక్కేసి క్లారిటీ చేసుకోంది. ఏ చిత్రంలో ఎందులో స్ట్రీమింగ్ అవుతోందో వివరాలను తెలిసేసుకోండి.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో
బ్లాక్ బస్టర్ మంజుమ్మెల్ బాయ్స్ (మలయాళ డబ్బింగ్ సినిమా Manjummel Boys) - మే 05
మాన్‌స్టర్స్ ఎట్ వర్క్ సీజన్- 2 (ఇంగ్లీష్ సిరీస్) - మే 05
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నెట్‌ఫ్లిక్స్‌లో
అజయ్ దేవగణ్ సైతాన్ (హిందీ సినిమా) - మే 03
ద అటిపికల్ ఫ్యామిలీ (కొరియన్ సిరీస్) - మే 04
అమెజాన్ ప్రైమ్‌లో
ఉమన్ ఆఫ్ మై బిలియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) - మే 03
క్లార్క్ సన్ ఫార్మ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03
- " class="align-text-top noRightClick twitterSection" data="">
జీ5లో
సోనాలి బింద్రే ది బ్రోకెన్ న్యూస్-2(బాలీవుడ్ వెబ్ సిరీస్)- మే 03
జియో సినిమాలో
ద టాటూయిస్ట్ ఆఫ్ అస్విట్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 03
హ్యాక్స్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - మే 03
వోంకా (ఇంగ్లీష్ మూవీ) - మే 03
లయన్స్ గేట్ ప్లేలో
బ్లాక్ మాఫియా ఫ్యామిలీ సీజన్-3- మే 03
వీరమల్లు రిలీజ్ డేట్ ఇదే - చిక్కుల్లో పడ్డ ఓజీ - Pawankalyan
అమ్మాయి హత్య కేసులో ఇరుక్కున్న సుహాస్ బయటపడ్డాడా? - Prasanna vadhanam Review