This Week OTT Releases : వీకెండ్ వచ్చేసింది. దీంతో ఓటీటీల్లో ఎప్పటిలానే పలు సినిమా, సిరీస్‌లు రిలీజ్‌కు సిద్ధమైపోయాయి. అందులో తెలుగు ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి. మరి ఈ వీకెండ్ కోసం రెండు రోజుల ముందుగానే వచ్చేసిన ది బెస్ట్ సినిమా, సిరీస్‌లు ఏంటో వివరాలను తెలుసుకుందాం.
గొర్రె పురాణం - ఈ మధ్య వరుసగా హిట్స్ అందుకుంటున్న యంగ్ హీరో సుహాస్ రీసెంట్గా సెప్టెంబర్ 20న థియేటర్లలో గొర్రె పురాణంతో ప్రేక్షకులను అలరించారు. కొన్ని వాస్తవ సంఘటనలతో ఇది తెరకెక్కింది. ప్రస్తుతం ఈ చిత్రం ఆహా ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత 20 రోజుల్లోనే ఇది ఓటీటీలోకి వచ్చేసింది.
పైలం పిలగా - రీసెంట్గా తెలుగులో విడుదలైన లవ్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా పైలం పిలగా. ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న థియేటర్లలో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమాలో సాయి తేజ కల్వకోట, పావని కరణం నటించారు.
తత్వ - తెలుగు క్రైమ్ థ్రిల్లర్ 'తత్వ' కూడా ఈటీవీ విన్లోనే నేటి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. హిమ దాసరి, ఉస్మాన్ గని, పూజా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. రిత్విక్ యెలగరి దర్శకత్వం వహించారు.
వేదా - బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహం, శార్వరి వాఘ్, అభిషేక్ బెనర్జీ, ఆశిష్ విద్యార్థి కలిసి నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ వేదా. మిల్కీ భామ తమన్నా భాటియా గెస్ట్ రోల్ చేసింది. ఈ చిత్రం ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజైంది. జీ తెలుగు ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
సిటాడెల్ : డయానా - హాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిటాడెల్ : డయానా అమెజాన్ ప్రైమ్‌లో ఇవాళ నుంచే స్ట్రీమింగ్కు వచ్చింది.
జోసన్ అటార్నీ ఏ మొరాలిటీ - ఐఎమ్‌డీబీలో 7.5 రేటింగ్ అందుకున్న ఈ కొరియన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్ జోసన్ అటార్నీ ఏ మొరాలిటీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చింది. కొరియన్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది.
'వేట్టాయన్' - ది హంటర్ రివ్యూ ఇదే - సినిమా ఎలా ఉందంటే?
రజనీ కాంత్ 'వేట్టాయన్' - ఒకే థియేటర్‌లో సినిమా చూసిన ధనుశ్, ఐశ్వర్య