ETV Bharat / entertainment

దేవర మూడో సాంగ్ రిలీజ్- ఎన్టీఆర్, జాన్వీ ఎనర్జిటిక్ స్టెప్పులు చూశారా! - Devara Songs - DEVARA SONGS

Devara Daavudi Song: ఎన్టీఆర్- జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న 'దేవర పార్ట్ -1' నుంచి మూడో పాట రిలీజైంది. 'దావూదీ' అనే పాటను మూవీ మేకర్స్ బుధవారం విడుదల చేశారు. మరి మీరు ఈ పాట విన్నారా?

Devara
Devara (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2024, 5:11 PM IST

Updated : Sep 4, 2024, 6:12 PM IST

Devara Daavudi Song: ఎన్టీఆర్- జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న 'దేవర పార్ట్ -1' నుంచి మూడో పాట రిలీజైంది. 'దావూదీ' అనే పాటను మూవీ మేకర్స్ బుధవారం విడుదల చేశారు. ప్రముఖ లిరిసిస్ట్​ రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాశారు. మ్యూజిక్ సంచలనం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిచగా, సింగర్స్​ నకాశ్ నజీజ్, ఆకసా పాట ఆలపించారు. ఈ పాటలో ఎన్టీఆర్- జాన్వీ కపూర్ డ్యాన్స్ అదరగొట్టేశారు. ఫుల్ ఎనర్జీతో స్టెప్పులు ఇరగదీశారు.

ఈ పాట నిమిషాల్లోనే యూట్యూబ్​లో లక్షల వ్యూస్​తో దూసుకుపోతోంది. గంటలోనే 1 మిలియన్ వ్యూస్ మార్క్ దాటేసింది. దీంతో ఈ పాట ట్రెండింగ్​లోకి వచ్చేసింది. కాగా, ఇప్పటికే విడుదలైన 'ఫియర్' (Fear), 'చుట్టమల్లె' (Chuttamalle) సాంగ్స్​కు కూడా ప్రేక్షకుల నుంచి మ్యాసీవ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా డ్యుయెట్ చుట్టమల్లె సాంగ్​ బాగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ పాటపై నెటిజన్లు లక్షల్లో రీల్స్ చేశారు. రీసెంట్​గా ఈ సాంగ్​ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ మార్క్ దాటింది.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ భారీ బడ్జెట్​తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కోస్టల్ బ్యాక్​ డ్రాప్​లో ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజైన వీడియో గ్లింప్స్​ కూడా ఆకట్టుకుంది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్​బస్టర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడం వల్ల దేవరపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. మరోవైపు ఈ సినిమాలో తారక్ డ్యుయల్ రోల్​లో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. సీనియర్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్​గా నటిస్తున్నారు.

ఇంకా శ్రీకాంత్, రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్, శ్రుతి మరాఠే, చైత్ర రాయ్ తదితరులు ఆయా పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమా రూపొందుతోంది. దేవర పార్ట్ 1 వరల్డ్​వైడ్ సెప్టెంబర్ 27న గ్రాండ్​గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ త్వరలోనే ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు.

ఓవర్సీస్​లో 'దేవర' మేనియా- 6 నిమిషాల్లోనే ప్రీ బుకింగ్స్ సోల్డ్​ ఔట్! - Devara Overseas Pre Sales

సెప్టెంబర్​లో సినిమా పండగ- కళ్లన్నీ 'దేవర', 'గోట్'పైనే- లిస్ట్​లో 'ఎమర్జెన్సీ' కూడా - September Movies 2024

Last Updated : Sep 4, 2024, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.