ETV Bharat / entertainment

ఆ సినిమాలో ఉన్నవి మూడు పాత్రలే! - థ్రిల్లర్ మూవీ 'తత్వ' ప్రేక్షకులను మెప్పించిందా?

'ఈటీవీ విన్‌'లో సూపర్ థ్రిల్లర్​ - 'తత్వ' వెబ్​ సినిమా ఎలా ఉందంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Tatva Latest Web Movie Review
Tatva Web Movie (ETV Win)

Tatva Latest Web Movie Review : కేవలం మూడు పాత్రలే ప్రధానంగా రుత్విక్‌ యెలగరి అనే యంగ్ డైరెక్టర్ తెరకెక్కించిన చిత్రం 'తత్వ'. నేరుగా​ ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? దీని ద్వారా డైరెక్టర్ ఏం చెప్పారంటే?

కథ ఏంటంటే?
ఆరిఫ్‌ (హిమ దాసరి) ఓ క్యాబ్‌ డ్రైవర్‌. అయితే అతడు వ్యాపారవేత్త థామస్‌ (ఉస్మాన్‌ ఘని) హత్య కేసులో అనుకోకుండా ఇరుక్కుంటాడు. ఆ విషయం కాస్త మీడియాలో హైలైట్‌ అవుతుంది. దీంతో కేసును దర్యాప్తు చేసేందుకు డీసీపీకి కాబోయే కోడలు, పోలీసు ఆఫీసర్‌ జ్యోత్స్న (పూజారెడ్డి బోరా) బరిలోకి దిగుతుంది. అయితే దేవుడే తనతో ఇదంతా చేయించాడంటూ ఆరిఫ్‌ విచారణలో చెబుతాడు. జ్యోత్స్న ఎంత ప్రయత్నించినా కూడా అతడి నుంచి వచ్చే సమాధానమిదే. అయితే ఆ పోలీసు ఆఫీసర్‌ ఆరిఫ్‌ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంది? థామస్‌ మర్డర్‌కు ఆరిఫే కారణమా? ఇక రెండు రోజుల్లో ఎంగేజ్​మెంట్​ చేసుకోనున్న జ్యోత్స్న ఆ కేసును తానే ఎందుకు డీల్‌ చేయాలనుకుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే?
"దేవుడెక్కడో లేడు సాటి మనిషిలోనే ఉన్నాడు" అనే విషయాన్ని తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్ రుత్విక్‌. ఓ క్యాబ్‌ డ్రైవర్‌, ఓ బిజినెన్​మెన్​, ఓ పోలీసు ఆఫీసర్‌ ఇలా మూడు పాత్రలతోనే ఈ కథను నడిపించి మెప్పించారు డైరెక్టర్. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా రన్‌టైమ్‌ కూడా 58 నిమిషాలు ఉండటం ప్రేక్షకుడికి ఊరటనిచ్చే అంశంగా నిలిచింది.

ఇక హీరో ఏదో కష్టంలో ఉన్నాడని, అతడికి డబ్బు అవసరం అనే విషయం ఆరంభ సన్నివేశాల్లోనే అర్థమైపోతుంది. అలా ఎమోషనల్‌గా స్టార్ట్‌ అయ్యి, వ్యాపారి హత్యకు గురికావడం, దానికి సంబంధిత కేసు ఇన్వెస్టిగేషన్‌తో ఉత్కంఠగా మారుతుంది. క్యాబ్‌ డ్రైవర్‌ ఆరిఫ్‌ నుంచి పోలీసు అధికారిణి జ్యోత్స్న నిజం తెలుసుకునే క్రమంలో దేవుడి అంశం తెరపైకి వస్తుంది. అలా స్టోరీ కాస్త ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది.

హీరో కష్టకాలంలో ఉన్నప్పుడో దైవం లేదు దెయ్యమూ లేదన్నప్పుడో దేవుడు/అదృశ్య శక్తి ప్రత్యక్షమవ్వడం. ఆ ఇద్దరి మధ్య చర్చ జరగడం ఇప్పటికే పలు సినిమాల్లో చూశాం. ఇందులోనూ సేమ్​ అదే టెంప్లేట్‌ కనిపిస్తుంది. కానీ, ఓ మనిషి చావును కేంద్రంగా చేసుకుని నడిపించిన కథనం కాస్త కొత్తగా అనిపిస్తుంది. వారు మాట్లాడే డైలాగ్స్ ఆడియెన్స్​ను ఆలోచింపజేస్తాయి. అయితే, ఆరిఫ్‌ ఏ విషయంలో అంతగా ఇబ్బంది పడుతున్నాడో దాన్ని తెరపై చూపించి ఉంటే బాగుండేది. కేవలం మాటలకే పరిమితం చేయడం వల్ల భావోద్వేగాలు అంతగా పండలేదు. ఆరిఫ్‌కు జ్యోత్స్న గతం గురించి తెలిసే నేపథ్యంలో ఊహించని ట్విస్టు ఎదురవుతుంది. అయితే, ఆ క్యారెక్టర్‌ను అసంపూర్తిగా ముగించడం కూడా ప్రేక్షకుడికి అసంతృప్తే. వ్యాపారి థామస్‌ పాత్ర విషయంలోనూ అదే భావన కలుగుతుంది.

ఎవరెలా చేశారంటే?
హిమ దాసరి, ఉస్మాన్‌, పూజారెడ్డి తమ యాక్టింగ్​తో ఆడియెన్స్​ను ఆకట్టుకున్నారు. హిమ, ఉస్మాన్‌తో పోలిస్తే పూజ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ చాలా తక్కువ. ఇక సాంకేతికంగానూ అన్ని విభాగాల వారు చక్కని ప్రతిభ చూపారు. తాను అనుకున్నది సూటిగా చెప్పడంలో రచయిత- దర్శకుడు రుత్విక్‌ మంచి మార్కులు కొట్టేశారు.

కుటుంబంతో కలిసి చూడొచ్చా? : ఇది ఫ్యామిలీతో చూడదగ్గ సినిమానే. ఇందులో ఎటువంటి అసభ్యకర డైలాగ్స్​, సీన్స్​ కూడా లేవు.

బలాలు

+ కాన్సెప్టు

+ ప్రీ క్లైమాక్స్‌ ట్విస్టు

బలహీనతలు

- కొరవడిన భావోద్వేగాలు

- అసంపూర్తిగా పాత్రలను ముగించడం

చివరిగా : థ్రిల్‌ పంచుతూ సందేశమిచ్చే 'తత్వ'

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.