ETV Bharat / entertainment

ఆ సినిమా కంటే ముందే గేమ్​ఛేంజర్ రిలీజ్ పక్కా!: సూర్య - Game Changer Release - GAME CHANGER RELEASE

Game Changer Release: తమిళ నటుడు ఎస్​జే సూర్య ప్రస్తుతం 'గేమ్​ఛేంజర్', 'భారతీయుడు' సీక్వెల్స్​లో నటించారు. అయితే రీసెంట్​గా భారతీయుడు ప్రీ రిలీజ్ ఈవెంట్​లో పాల్గొన్న సూర్య గేమ్​ఛేంజర్ మూవీ రిలీజ్​పై క్లారిటీ ఇచ్చారు.

Game Changer Release
Game Changer Release (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 9:47 AM IST

Updated : Jul 8, 2024, 10:17 AM IST

Game Changer Release: గ్లోబల్ స్టార్ రామ్​చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'గేమ్​ఛేంజర్'. పలు కారణాల వల్ల ఈ సినిమా చాలా ఏళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. డైరెక్టర్ శంకర్ 'భారతీయుడు' సీక్వెల్స్, 'గేమ్​ఛేంజర్' ఒకేసారి తెరకెక్కించడమే ఇందుకు కారణం. అయితే కొన్ని నెలల కిందటే భారతీయుడు సీక్వెల్స్ చిత్రీకరణ పూర్తవడం వల్ల శంకర్ 'గేమ్​ఛేంజర్'పై ఫోకస్ చేశారు. దీంతో ఈ సినిమా షూటింగ్ దాదాపు 90 శాతం పూర్తయ్యింది. ఇక డిసెంబర్​లో సినిమా విడుదల కావడం ఖాయమని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

ఈ నేపథ్యంలో సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న నటుడు ఎస్​జే సూర్య రిలీజ్​పై ఓ క్లారిటీ ఇచ్చారు. ఎస్​జే సూర్య 'గేమ్​ఛేంజర్'తోపాటు 'భారతీయుడు' సీక్వెల్స్​లో కూడా నటించారు. అందులో 'భారతీయుడు' జులై 12న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో 'భారతీయుడు' ప్రీ రిలీజ్ ఈవెంట్​లో పాల్గొన్న సూర్య 'గేమ్​ఛేంజర్' రిలీజ్​పై క్లారిటీ ఇచ్చారు.

'జులై 12న రిలీజ్ కానున్న భారతీయుడు- 2 సినిమాను థియేటర్లలో చూడండి. ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ సమయంలోనే భారతీయుడు- 3 ట్రైలర్ అండ్ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. కానీ, దాని కంటే ముందే 'గేమ్ ఛేంజర్' వచ్చేస్తుంది. నేను ఈ 3సినిమాల్లో నటించా. అన్నింటిలో నా పాత్ర అద్భుతంగా ఉంటుంది' అని పేర్కొన్నారు. అయితే భారతీయుడు- 3 సినిమా మరో 6 నెలల్లోనే ప్రేక్షకులముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. ఈ లెక్కన గేమ్​ఛేంజర్ కచ్చితంగా డిసెంబర్​లోనే వచ్చే ఛాన్స్ ఉంది.

గేమ్ ఛేంజర్ సినిమా గురించి రామ్​చరణ్ తాజాగా ఓ అప్టేడ్ ఇచ్చారు. సినిమాలో తన పాత్ర చిత్రీకరణ పూర్తైనట్లు ఓ పోస్ట్ చేశారు. అందులో రెండు ఫొటోలుండగా రెండింటిలోనూ చరణ్ హెలికాప్టర్ దగ్గరకు నడుస్తూ వెళుతుంటారు. ఈ ఫొటోల్లో ఒకటి గేమ్ ఛేంజర్ షూటింగ్ సందర్భంగా దిగినట్లుగా ఉంటే, మరొకటి షూటింగ్ ముగించుకుని వెళుతున్నట్లుగా కనిపిస్తుంది. 'గేమ్ మారబోతుంది. గేమ్ ఛేంజర్ వచ్చేస్తుంది థియేటర్లో కలుద్దాం' అని పోస్టుకు క్యాప్షన్ రాసుకొచ్చారు. కాగా, ఈ సినిమాలో కియారా అడ్వాణీ హీరోయిన్​గా నటిస్తోంది.

మెగాఫ్యాన్స్​కు డబుల్ ట్రీట్- నెల గ్యాప్​లో రెండు సినిమాలు!

'గేమ్​ఛేంజర్'​ - రామ్​చరణ్​కు బిగ్ రిలీఫ్​

Last Updated : Jul 8, 2024, 10:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.