ETV Bharat / entertainment

'హరోం హర' రిలీజ్ పోస్ట్​పోన్​ - సుధీర్​కు కలిసొచ్చే నెలలో రిలీజ్ - Harom Hara Movie Release Date

SudSudheer Babu Harom Hara Movie : టాలీవుడ్ స్టార్ హీరో సుధీర్ బాబు లీడ్​ రోల్​లో తెరకెక్కిన హరోం హర మూవీ రిలీజ్​ పోస్ట్​పోన్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల కానుందంటే ?

author img

By ETV Bharat Telugu Team

Published : May 21, 2024, 1:50 PM IST

Sudheer Babu Harom Hara Movie
Sudheer Babu Harom Hara Movie (Source : ETV Bharat Archives)

Sudheer Babu Harom Hara Movie : టాలీవుడ్ స్టార్ హీరో సుధీర్ బాబు లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ 'హరోం హర'. పీరియాడికల్ థ్రిల్లర్​గా రూపొందిన ఈ సినిమా త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా ఈ మూవీ మేకర్స్ రిలీజ్​ను వాయిదా వేసినట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే కొత్త డేట్​ను కూడా అనౌన్స్​ చేశారు. వాస్తవానికి ఈ చిత్రం మే 31న విడుదల కావాల్సింది. అయితే ఇప్పుడు దాన్ని జూన్ 14కు వాయిదా వేశారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ తొలుత నిరాశ చెందినప్పటికీ, త్వరగానే రిలీజ్ అవుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ఈ సినిమా వాయిదా పట్ల హీరో సుధీర్ బాబు నిరాశ వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కోసం పోస్ట్ పెట్టారు.

"కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్​ను పోస్ట్​పోన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని జూన్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నాం. సూపర్ స్టార్ కృష్ణ బర్త్​డే సందర్భంగా మొదట దీన్ని మే 31న విడుదలచేయాలని మేము భావించాం. కానీ, ఆ తేదీ మిస్‌ అయినందుకు నాకు చాలా బాధగా ఉంది. అయితే జూన్‌ నాకు చాలా కలిసొచ్చే మంత్. గతంలో నేను నటించిన 'ప్రేమకథా చిత్రం', 'సమ్మోహనం' ఇలా రెండూ జూన్‌లో రిలీజై మెప్పించాయి. అలానే 'హరోం హర' కూడా మీ అంచనాలను కచ్చితంగా అందుకుంటుంది" అంటూ సుధీర్ బాబు పేర్కొన్నారు.

ఇక 'హరోం హర' సినిమా విషయానికి వస్తే, కుప్పం నేపథ్యంలో రూపొందుతున్న ఓ ఫిక్షనల్‌ స్టోరీ ఇది. 1989-90 సంవత్సరాల మధ్యలో ఈ కథ జరిగినట్టుగా మేకర్స్ చూపించారు. అంతే కాకుండా నిజ జీవితంలో స్ఫూర్తి పొందిన పలు పాత్రలను ఆధారంగా చేసుకుని ఇందులో పాత్రలు క్రియేట్‌ చేసినట్లు తెలిపారు. ఇక సుధీర్ బాబు కూడా కథ, నటీనటుల పాత్రల చిత్రీకరణ, సినిమాలోని ప్రతి రంగంపై డైరెక్టర్​కు ఉన్న అభిరుచిని చూసి ఈ సినిమాకు ఓకే చెప్పానంటూ గతంలో వెల్లడించారు.

ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​- సుధీర్ కొత్త టాలెంట్​- వీడియో చూశారా? - Sudheer Babu harom hara movie

'సినిమా బాలేదంటే నష్టపరిహారం చెల్లించిన రోజులున్నాయి - నేను చేసినంతగా ఏ హీరో చేయలేరు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.