ETV Bharat / entertainment

ఫస్టాఫ్ డీలా- సెకండాఫ్​పైనే అందరి ఆశలు! ఏం జరుగుతుందో? - Tollywood Second Half - TOLLYWOOD SECOND HALF

Tollywood Movie Release in 2024: ఎన్నికల హడావిడిలో 2024 ఫస్ట్ హాఫ్ గడిచిపోయింది. ఫస్ట్​హాఫ్​లో ఒకట్రెండు మినహా పెద్ద సినిమాలేవీ రిలీజ్ కాలేదు. ఇక రానున్న సెకండ్ హాఫ్​లో భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలకు లైన్ కట్టాయి.

Tollywood Second Half
Tollywood Second Half (Source: Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 6, 2024, 3:21 PM IST

Tollywood Movie Release in 2024: భారీ హిట్ గా హనుమాన్, సూపర్ హిట్​గా డిజేటిల్లు, యావరేజ్​గా గుంటూరు కారం ఇది 2024 టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ బాక్సాఫీస్ రిపోర్ట్. ఎన్నో అంచనాలతో వచ్చిన ఫ్యామిలీ స్టార్​తో పాటు మరికొన్ని చిత్రాలు ఎన్నికల వేడిలో బాక్సాఫీస్ ముందు నిలబడలేకపోయాయి. ఇక హడావిడి ముగిసింది. ఇప్పటికే చాలా చిత్రాల విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఇక థియేటర్లలో మళ్లీ సందడి ప్రారంభం కానుంది.

కల్కి 2898 AD: అందరి కంటే ముందు జూన్ 27న థియేటర్ల లోకి వస్తున్నారు మన డార్లింగ్ ప్రభాస్. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు. ఈ సినిమాలో ఉన్న ఫ్యూచర్ కార్ బుజ్జి కూడా మూవీ లవర్స్ కోసం దేశమంతటా పరుగు తీస్తుంది. అమితాబ్, కమల్ హాసన్, దీపిక పదుకొణె, దిశా పటాని వంటి బాలీవుడ్ స్టార్స్​తో తెరకెక్కిన ఈ చిత్రం సినిమా ప్రమోషన్స్​లో కూడా సరికొత్త ట్రెండ్ సృష్టించింది.

పుష్ప 2: అల్లు అర్జున్ మరోసారి తగ్గేదేలే అంటూ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. లాంగ్ వీకెండ్ కావడం వల్ల మంచి టాక్ వస్తే మాత్రం కచ్చితంగా బాక్సాఫీస్ రికార్డులు బద్దలగొట్టే ఛాన్స్ ఉంది. తాజాగా విడుదలైన అల్లు అర్జున్- రష్మిక డ్యూయెట్ కూడా ఆడియెన్స్​ను బాగా ఆకట్టుకుంటోంది.

దేవర: 'దేవర' గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. మేలో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి కాకపోవడం వలన అక్టోబర్ 10కు వాయిదా వేశారు. కానీ పదిరోజుల ముందే అంటే సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఇండస్ట్రిలో టాక్. ఇక సినిమా ఎప్పుడు వచ్చినా బ్రేక్ ఇవ్వడానికి ఫ్యాన్స్​ సిద్ధంగా ఉన్నారు.

గేమ్ ఛేంజర్: 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్​తో పాటు రామ్​చరణ్ కూడా ఏ మూవీని విడుదల చేయలేదు. మెగా ఫ్యాన్స్ కూడా శంకర్ దర్శకత్వంలో రానున్న గేమ్ ఛేంజర్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళికి రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం.

హరిహర వీరమల్లు: ఇప్పటికే చాలా వాయిదాలతో ఫ్యాన్స్​ను విసిగించిన ఈ మూవీ కూడా 2024లోనే విడుదల కాబోతుందని మేకర్స్ అంటున్నారు. దీంతో పవన్ కల్యాణ్​ను ఆయన ఫ్యాన్స్​ త్వరలోనే తెరపై చూడనున్నారు.

హాలీవుడ్ ఆల్ టైమ్​ క్లాసిక్ మూవీస్- పక్కా ఇన్స్పిరేషన్​! - Inspirational movies

OTTలో దూసుకెళ్తోన్న భయపెట్టే దెయ్యం సినిమా - ట్విస్టులే ట్విస్టులు! - Latest Horror Movie OTT

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.