ETV Bharat / entertainment

'1000 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం' - కోహినూర్‌ వజ్రం కోసం స్టార్ బాయ్ పోరాటం!

దసరా సందర్భంగా సోషియో ఫాంటసీ సినిమాను ప్రకటించిన స్టార్ బాయ్​ సిద్ధు జొన్నలగడ్డ!

author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Siddhu Jonnalagadda Kohinoor Movie
Siddhu Jonnalagadda Kohinoor Movie (source ETV Bharat)

Siddhu Jonnalagadda New Movie : ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న సిద్ధు జొన్నలగడ్డ, డీజే టిల్లుతో ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు. ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్లు చేసిన ఇతడు ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దసరా పండగను పురస్కరించుకుని, సినీ ప్రియులను ఆశ్చర్యపరిచేలా సినిమాను ప్రకటించాడు. కోహినూర్‌ వజ్రం లాంటి వార్తతో శుభాకాంక్షలు చెప్పాడు.

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై సినిమాను ప్రకటించాడు. రవికాంత్ ప్రేరేపు దర్శకత్వంలో కోహినూర్ అనే సోషియో ఫాంటసీ సినిమాను అనౌన్స్ చేశాడు. కోహినూర్ పార్ట్ 1 అని పోస్టర్​పై రాసి ఉండడంతో ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని అర్థమైంది.

మొదటిభాగం 2026 సంక్రాంతికి విడుదల కానుంది. "మాకు చెందిన వాటిని తీసుకురావడానికి మేం 1000 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాం. భద్రకాళి వైభవాన్ని ఈ వీరుడు తిరిగి తీసుకువస్తాడు" అంటూ నిర్మాత నాగవంశీ పవర్‌ఫుల్‌ పోస్టర్‌ను పంచుకున్నారు.ఈ పోస్టర్​లో చుట్టూ రాజుల కాలం లాంటి శిలా తోరణం ఉండగా మధ్యలో సిద్ధూ కత్తి పట్టుకొని కోహినూర్ వజ్రం పట్టుకొని ఉన్నాడు. దీంతో ఈ పోస్టర్​తోనే సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.

Siddhu Jonnalagadda Kohinoor Movie : కాగా, భద్రకాళి మాత మహిమగా నిలిచిన కోహినూర్ వజ్రం మన దేశం దాటి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆ వజ్రాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ఓ యువకుడు ఎలాంటి పోరాటం చేశాడనేదే ఈ సినిమా కథాంశం అని తెలుస్తోంది. ఇకపోతే గతంలో సిద్ధు జొన్నలగడ్డ దర్శకుడు రవికాంత్​తో కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా తీసి విజయాన్ని అందుకున్నారు. ఇక ఇదే సితార ఎంటర్​టైన్మెంట్​ సంస్థలో డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలను చేసి సక్సెస్ సాధించాడు. దీంతో కోహినూర్ చిత్రంతో ఈ హిట్​ కాంబోలు మరోసారి బ్లాక్ బస్టర్​ అందుకోవడం ఖాయమని సినీ ప్రియులు భావిస్తున్నారు.

దసరా ట్రీట్​​ - అంతకుమించి అనేలా 'విశ్వంభర' విజువల్ వండర్​ టీజర్​

'BB4' దసరా​ బ్లాక్​ బస్టర్​ అప్డేట్​ - షూటింగ్ ఆ రోజు నుంచే ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.