ETV Bharat / entertainment

'భారతీయుడు- 2' పబ్లిక్​ టాక్- క్లైమాక్స్ నెక్ట్స్ లెవెల్ అంట! - Bharateeyudu 2 Reivew - BHARATEEYUDU 2 REIVEW

Bharateeyudu 2 review: లోకనాయకుడు కమల్​హాసన్- స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన 'భారతీయుడు- 2' జులై 12న రిలీజైంది. మరి సినిమా టాక్ ఏంటంటే?

Bharateeyudu 2 review
Bharateeyudu 2 review (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 7:53 AM IST

Updated : Jul 12, 2024, 8:40 AM IST

Bharateeyudu 2 review: లోకనాయకుడు కమల్​హాసన్- స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన 'భారతీయుడు- 2' శుక్రవారం (జులై 12) థియేటర్లలో విడుదల అయ్యింది. 1996లో బ్లాక్​బస్టర్ హిట్ 'భారతీయుడు' సినిమాకు ఇది సీక్వెల్​గా తెరకెక్కింది. ఈ సినిమాకు హైదరాబాద్ సహా పలు నగరాల్లో శుక్రవారం ఉదయాన్నే స్పెషల్ షోస్ పడ్డాయి. మరి దాదాపు 28ఏళ్ల తర్వాత కమల్- శంకర్ కాంబోలో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ఆడియెన్స్ టాక్ ఏంటంటే?

భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమాకు ప్రీమియర్స్ నుంచే మిశ్రమ స్పందన వస్తోంది. ఎప్పటిలాగే అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం ఇరగదీశాడని అంటున్నారు. కానీ, స్టోరీ మాత్రం రోటిన్​గా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. రొటీన్ స్టోరీకి బీజీఎమ్, వీఎఫ్​క్స్​ జోడించారని తన అభిప్రాయాన్ని ట్విట్టర్​లో తెలిపారు. అయితే ప్రీమియర్స్​ చూసిన ప్రేక్షకులు మాత్రం సినిమా అదిరిపోయిందంటూ రివ్యూలు ఇస్తున్నారు. హీరోగా కమల్​హాసన్ మాత్రం నటనలో విశ్వరూపం చూపించారని టాక్. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్​లో అదరగొట్టారంట. సినిమాలో ఆయన నటనే హైలైట్​ అంటున్నారు.

ఇక అక్కడక్కడా కమల్ హాసన్, సిద్ధార్థ్ మధ్య సన్నివేశాలు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారంట. వీఎక్స్​, విజువల్స్​తో మాత్రం శంకర్ ఆడియెన్స్​కు ట్రీట్ ఇచ్చారంట. సీజీ వర్క్స్​తో సినిమాను గ్రాండ్​గా తెరకెక్కించారని అంటున్నారు. ఇక 'భారతీయుడు- 3' పైన ఆసక్తి పెంచేలా క్లైమాక్స్​లో ఇచ్చిన ట్విస్ట్​​ ప్రేక్షకులను మెప్పిస్తుందట. కాగా, సిద్ధార్థ్, రకుల్​ప్రీత్ సింగ్, సముద్రఖని, బాబి సింహా తదితరులు తమతమ పాత్రల్లో అదరగొట్టారని టాక్.

ఇక సినిమా విషయానికొస్తే, కమల్ హాసన్​తోపాటు సిద్ధార్థ్, రకుల్​ప్రీత్ సింగ్, ప్రియాభవాని శంకర్, సముద్రఖని, వేణు నేడుముడి, బాబి సింహా, బ్రహ్మానందం, యస్ జే సూర్య తదితరులు నటించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్​పై సుభాస్కరణ్ ఈ సినిమాను నిర్మించారు.

Bharateeyudu 3: ఈ సినిమాకు మూడో భాగం కూడా ఉన్నట్లు మేకర్స్ ఇదివరకే చెప్పారు. ఆ సినిమాను మరో 6నెలల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు ప్రమోషన్స్​ టైమ్​లో తెలిపారు.

ఆ ముగ్గురి వల్లే కమల్​కు ఛాన్స్​!- 'ఇండియన్' మిస్ చేసుకున్న స్టార్స్ ఎవరంటే? - Kamal Haasan Indian 2

'భారతీయుడు 2'కు తెలుగులో రికార్డ్​ బిజినెస్! - హిట్ స్టేటస్​కు ఎన్ని కోట్లు రావాలంటే?

Last Updated : Jul 12, 2024, 8:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.