ETV Bharat / entertainment

మహేశ్‌, రాజమౌళి సినిమా - వాటిని నమ్మకండి - SSMB29 Movie - SSMB29 MOVIE

Rajamouli Mahesh Babu SSMB29 : సినిమా గురించి మీడియాలో వస్తున్న ఆ విషయంపై నమ్మొద్దని ఆ చిత్ర నిర్మాత గోపాల్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఏం అన్నారంటే?

మహేశ్‌, రాజమౌళి సినిమా - వాటిని నమ్మకండి

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 20, 2024, 8:30 PM IST

Updated : Apr 20, 2024, 9:00 PM IST

Rajamouli Mahesh Babu SSMB29 : రాజమౌళి మహేశ్​ కాంబోలో తెరకెక్కనున్న SSMB29 ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అభిమానులు అప్డేట్స్​ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ గురించి మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు కూాడా మాట్లాడుకుంటున్నారు. సినిమాకు సంబంధించి రకరకాల రూమర్స్ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ గోపాల్ రెడ్డి సినిమా గురించి మాట్లాడారు.

"ప్రస్తుతం హైదరాబాద్​లో ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్​ జరుగుతోంది. ఈ చిత్రం గురించి ప్రతి అప్డేట్ రాజమౌళికి తప్ప ఎవరికీ తెలీదు. ఆయన తన ప్రతి సినిమాకు ఇచ్చే డెడికేషన్ అలాంటిది. ఈ చిత్రానికి కథను అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్ గారితో నేను మాట్లాడాను. ఆయన ద్వారా ఈ ఫిల్మ్ స్టోరీ మొత్తం విన్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ మూవీ షూటింగ్ అప్డేట్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఆ తర్వాత రిలీజ్ అప్డేట్ అన్ని రాజమౌళికి తప్ప మరెవరికి తెలీదు. ఈ సినిమా అప్డేట్స్ అంటూ మీడియాలో, ఫ్యాన్ పేజీల్లో రాసే ప్రతి సమాచారాన్ని పుకార్లను నమ్మొద్దు" అని గోపాల్ రెడ్డి అన్నారు.

ఇకపోతే యాక్షన్ అడ్వెంచర్​గా హాలీవుడ్ రేంజ్​లో తెరకెక్కనున్న ఈ మూవీ కథ ఆఫ్రికా అడవుల నేపథ్యంగా తెరకెక్కనుంది. ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తీస్తున్న మూవీ కాబట్టి హాలీవుడ్ యాక్టర్స్​ను కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ చిత్రంలో బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ నటించనున్నారనే వార్త జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ మూవీకి మహరాజ్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. రీసెంట్​గానే మహేశ్​ రాజమౌళి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్​లో సందడి చేశారు. మహేశ్​ లుక్​ ఫ్యాన్స్​ను బాగా ఆకట్టుకుంది. లుక్ టెస్ట్ కోసం(Mahesh Babu Look SSMB 29) మహేశ్​, రాజమౌళి దుబాయ్ వెళ్లారని అంటున్నారు. ఈ విషయంపై ఆ చిత్ర బృందం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు.
నభా నటేశ్ పర్సనల్ లైఫ్​పై ప్రియదర్శి కామెంట్స్ - స్టేజ్ పైనుంచి కోపంతో వెళ్లిపోయిన హీరోయిన్! - Darling Movie Promo Release event

తారకరత్న పిల్లలతో బాలయ్య, మోక్షజ్ఞ - ఫొటోస్ చూశారా? - Balakrishna Mokshagna

Last Updated : Apr 20, 2024, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.