ETV Bharat / entertainment

బిగ్​ ట్విస్ట్​- 'పుష్ప 2' టీమ్​లోకి తమన్- BGM కోసమేనట! - SS THAMAN FOR PUSHPA 2

బిగ్​ ట్విస్ట్​- 'పుష్ప 2' టీమ్​లోకి తమన్- BGM కోసమేనట!

Pushpa BGM Composer
Pushpa BGM Composer (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2024, 7:02 AM IST

SS Thaman For Pushpa 2 : ఐకాన్​స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాకు రోజురోజుకూ విపరీతమైన బజ్ క్రియేట్ అవుతోంది. రిలీజ్​కు సమయం దగ్గర పడుతుండడం వల్ల ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ కోసం మూవీటీమ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్​ను సంప్రదించినట్లు తెలుస్తోంది.

అయితే టాలీవుడ్​లో బీజీఎమ్ (BGM)కు కేరాఫ్ ఆడ్రస్​గా ఉన్న తమన్ ఈ సినిమాకు పని చేయాలని మేకర్స్ భావించారట. అందుకే పుష్ప బీజీఎమ్ పనులు తమన్​కు అప్పజెప్పినట్లు సమాచారం. దీనిపై తమన్ కూడా తన వర్క్ ప్రారంభించారని తెలుస్తోంది. త్వరలోనే ఫైనల్ కాపీ రెడీ చేసి, మూవీటీమ్​కు బ్యాక్​గ్రౌండ్ స్కోర్ వినిపించనున్నారని టాక్. అయితే బీజీఎమ్ తమన్ ఇస్తున్నప్పటికీ, పాటలు అందించింది మాత్రం ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్​ దేవీశ్రీ ప్రసాద్. కానీ, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తొలిసారి ఇలా
డైరెక్టర్ సుకుమార్ తీసిన దాదాపు అన్ని సినిమాలకు సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్. ఒకవేళ ఇది నిజమైతే సుకుమార్ సినిమాకు దేవీ కాకుండా మరో మ్యూజిక్ డైరెక్టర్​ సంగీతం అందించడం ఇదే తొలిసారి అవుతోంది. మరోవైపు ఈ వార్తతో ఫ్యాన్స్​ మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు. పాటలకు దేవీ, బీజీఎమ్​కు తమన్ అదిరిపోయే కాంబినేషన్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ​

రికార్డ్ బ్రేక్
కాగా, నార్త్​ అమెరికాలో 'పుష్ప 2' ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కొద్ది గంటల్లోనే 15 వేలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దీంతో పుష్ప రిలీజ్​కు ముందే అరుదైన రికార్డు సాధించింది. ప్రీ బుకింగ్స్​లో 500k డాలర్లు వసూల్ చేసింది. ఈ క్రమంలోనే 'పుష్ప పార్ట్ 1' ఆల్​టైమ్ రికార్డ్​ను కూడా బ్రేక్ చేసింది. పుష్ప పార్ట్​ 1 సినిమాకు నార్త్​ అమెరికాలో ఓవరాల్​గా 400k డాలర్లు రాగా, ఈ సినిమా ఇప్పుడే 500k డాలర్లు కొల్లగొట్టింది.

కాగా, డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్​గా నటిస్తుండగా, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్​స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు పాటలు చాట్ బస్టర్ అయ్యాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్​వైడ్ గ్రాండ్​గా రిలీజ్ కానుంది.

ఇది 'పుష్ప' రూలింగ్- రిలీజ్​కు ముందే మరో రికార్డ్ బ్రేక్

'పుష్ప 2'లో శ్రీలీల! - ఆ స్పెషల్​ సాంగ్ కోసమేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.