Mathu Vadalara 2 Review : చిత్ర సీమలో ఈ మధ్య సీక్వెల్స్, ఫ్రాంచైజీల హవా ఎక్కువగా నడుస్తోంది. అలా తాజాగా విడుదలైన చిత్రం మత్తు వదలరా 2(Mathu Vadalara 2). ఆస్కార్ అవార్డ్ గ్రహీత కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన చిత్రమిది. కమెడియన్ సత్య కూడా కీలక పాత్ర పోషించారు. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉందంటే?
Mathu Vadalara 2 Story(కథేంటంటే) : బాబూ మోహన్ (శ్రీ సింహా), యేసు (సత్య) చేసే డెలివరీ ఏజెంట్స్ ఉద్యోగాలు ఊడిపోతాయి. దీంతో వారు హై ఎమర్జెన్సీ టీమ్‌లో స్పెషల్ ఏజెంట్స్‌గా జాయిన్ అవుతారు. కిడ్నాప్ కేసుల్ని ఛేదించి, నిందితుల్ని పట్టుకోవడం వీరి పని. అయితే ఈ క్రమంలోనే చేతి వాటం ప్రదర్శిస్తుంటారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడుతుంటారు. అయితే గట్టి జాక్ పాట్ కొట్టాలని ప్రయత్నిస్తుంటారు. అప్పుడే వారికి ఓ కిడ్నాప్ కేసు రాగా, అది రూ. 2 కోట్ల లావాదేవీలతో ముడిపడి ఉంటుంది ఎలాగైనా ఆ కేసును ఛేదించి రూ.2 కోట్లు దక్కించుకోవాలని బాబూ మోహన్, యేసు అనుకుంటారు. కానీ, ట్విస్ట్ ఏంటంటే కిడ్నాప్ గురైన యువతి వీళ్ల కారులోనే శవంగా కనిపిస్తుంది. అలానే ఈ ఇద్దరే కిడ్నాప్ చేశారనే రుజువు ఉన్న ఓ వీడియో కూడా బయటకు వస్తుంది. మరి ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు? ఈ కేస్ నుంచి బాబు మోహన్, యేసు అసలు బయట పడ్డారా? లేదా? అన్నదే ఈ కథ.
ఓటీటీలోకి అప్పుడే - 'మత్తు వదలరా 2' ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. థియేటర్లలో విడుదలైన 4 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుందట.
ఇంతకీ సినిమా ఎలా ఉందంటే? : మొదటి భాగంతో పోలిస్తే ఆ స్థాయి కామెడీ ఇందులో పండలేదనే చెప్పాలి. అయితే ట్రెండుకు తగ్గట్టుగానే రచన, సత్యతో సహా ఇతర నటులు చేసిన అల్లరి, టెక్నికల్ వ్యాల్యూస్ హంగులతో సినిమా పాస్ అవుతుంది. కథ, కథనాల పరంగా పెద్దగా మెరుపులేమీ లేవు. అదే సినిమాకు పెద్ద మైనస్.
ఇంటర్వెల్ సీన్స్ కథకు మంచి మలుపును ఇస్తూ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ను పెంచుతాయి. అనంతరం హత్య కేసు నుంచి బాబూ మోహన్, యేసూ ఎలా బయట పడ్డారు అన్నది సెకండాఫ్‌లో కీలకంగా మారుతుంది. అలా సినిమా కాస్త కామెడీతో పాటు ఓ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా సాగుతుంది. ఇంకా సినిమాలో వన్ లైనర్స్ పంచ్‌లు, సత్య చేసే కామెడీ అల్లరి, ట్రెండీ డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.
ఎవరెలా చేశారంటే ? - శ్రీసింహా, సత్య నటనే సినిమాకు ప్రధాన బలం. సత్య టైమింగ్ కామెడీ బాగుంది. ఫరియా అబ్దుల్లా హీ-టీమ్‌లో ఓ సభ్యురాలిగా ఉంటూ కామెడీ చేస్తుంది. కొన్ని యాక్షన్ సీన్స్‌లోనూ కనిపించింది. సునీల్, రోహిణి, వెన్నెల కిశోర్, అజయ్ పాత్రలు కూడా కీలకం. టెక్నికల్‌గా సినిమాకు తగ్గట్టుగా ఉంది. కాల భైరవ మ్యూజిక్ సినిమాకు మరో బలం. కెమెరా, ఎడిటింగ్ విభాగాలూ మంచి పనితీరును ప్రదర్శించాయి. దర్శకుడు రితేశ్ రాణా సంభాషలు నవ్విస్తాయి.
ఫైనల్‌గా మత్తు వదలరా 2 కొన్ని నవ్వులే మాత్రమే!
గమనిక : ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
చిన్న సినిమాలతో కొత్త శుక్రవారం - ఏఏ చిత్రాలు థియేటర్లలో వస్తున్నాయంటే? - THIS WEEK THEATRE RELASES
టొవినో థామస్ 'ఎ.ఆర్.ఎమ్' - కృతి శెట్టి ఫస్ట్ మలయాళం మూవీ ఎలా ఉందంటే? - ARM Movie Review