ETV Bharat / entertainment

బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీముఖి- పాన్ఇండియా మూవీలో ఛాన్స్​! - Sreemukhi Pan India Movie - SREEMUKHI PAN INDIA MOVIE

Sreemukhi Pan India Movie: బుల్లితెర రాములమ్మ బంపర్ ఆఫర్ కొట్టేసింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అప్పుడప్పుడు సినిమాల్లో, లీడింగ్ యాంకర్‌గా రెగ్యూలర్‌గా టీవీల్లో కనిపించే శ్రీముఖి ఇప్పుడు ఏకంగా పాన్ఇండియా సినిమాలో ఛాన్స్​ దక్కించుకుందట

Sreemukhi Pan India Movie
Sreemukhi Pan India Movie
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 5, 2024, 9:10 PM IST

Updated : Apr 6, 2024, 8:06 AM IST

Sreemukhi Pan India Movie: బుల్లితెర రాములమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లీడింగ్ యాంకర్‌గా రెగ్యూలర్‌గా టీవీల్లో కనిపిస్తూ సందడి చేస్తుంటుంది. మరోవైపు లేటెస్ట్​ ఫొటో షూట్​లతో సోషల్ మీడియాలోనూ యాక్టీవ్​గా ఉంటూ ఫ్యాన్స్​కు రెగ్యులర్​గా టచ్​లో ఉంటుంది. అప్పుడప్పుడు హాట్ డ్రెస్​లో కూడా కవ్విస్తుంటుంది. ఇక కెరీర్​లో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ కనిపించి ప్రేక్షకులను అలరించింది. గతంలో ఆమె జులాయి, నేను శైలజా సినిమాల్లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే ఈ బుల్లితెర యాంకర్ ఇప్పుడు ఏకంగా పాన్ఇండియా సినిమాలో ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్- అట్లీ కాంబోలో పాన్ఇండియా లెవెల్​లో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీముఖి నటించనుందట. ఈ సినిమాలో కూడా బన్నీకి సిస్టర్​ రోల్​లో కనిపించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. కాగా, ఇదివరకే వీరిద్దరూ త్రివిక్రమ్ డైరెక్షన్​లో వచ్చిన జులాయిలో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో బన్నీ ఫ్యాన్స్ మరోసారి వీరిద్దరినీ బిగ్ స్క్రీన్​పై చూసేందుకు ఇంట్రెస్టింగ్​గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సంచలనం అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా అఫీషియల్​గా ప్రారంభం కానుంది.

ఇక శ్రీముఖి చివరగా మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో కనిపించింది. ఈ మూవీలో శ్రీముఖి కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఖుషీ నడుము సీన్ రీక్రియేట్ చేసి థియేటర్లలో ప్రేక్షకుల చేత ఈలలు వేయించింది. బిగ్​బాస్​లో రన్నరప్‌గానూ నిలిచిన శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అవార్డు తీసుకోవడంతో పాటు, చిరు పొగడ్తలను కూడా అందుకోగలిగింది. కొన్ని నెలలుగా ఓ యువ హీరోతో ప్రేమాయణం సాగిస్తుందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తుండగా, త్వరలోనే వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలీదు. అయితే దాని కన్నా ముందు యాంకర్ ప్రదీప్‌కు శ్రీముఖికి మధ్య ఏదో సమ్​థింగ్ సమ్​థింగ్​ నడుస్తుందంటూ వచ్చిన వార్తలకు చెక్ పెడుతూ తాము ఫ్రెండ్స్ మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.

Last Updated : Apr 6, 2024, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.