Sohel Bootcut Balaraju: బిగ్‌బాస్ కంటెస్టెంట్, యంగ్ హీరో సోహైల్ లీడ్ రోల్లో తెరకెక్కిన 'బూట్‌కట్ బాలరాజు' సినిమా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు శ్రీనివాస్ కోనేటి దర్శకత్వం వహించారు. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి సొంతంగా సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు హీరో సోహైల్. రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సోహైల్ వ్యాఖ్యలు అందర్నీ షాక్‌కు గురిచేశాయి. ఆ ఈవెంట్లో సోహైల్ మోకాళ్లపై కూర్చుని 'సినిమా ప్రమోట్ చేసుకోడానికి నా దగ్గర డబ్బుల్లేవ్! నా సినిమా సినిమా చూడండి' అని ప్రేక్షకులకు విన్నవించుకున్నాడు.
ఇక సినిమా రిలీజ్ అయ్యాక సోహైల్ చేసిన పని మరోసారి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా చూసేందుకు ఓ థియేటర్‌కు వెళ్లిన సోహైల్ అందరి ముందు కంటతడి పెట్టుకున్నాడు. థియేటర్లలో ఆక్యుపెన్సీ తక్కువగా నమోదవ్వడం పట్ల సోహైల్ తీవ్రంగా బాధపడ్డాడు.' నేను కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసే సినిమా చేశాను. కంటెట్ ఉన్న సినిమాను ఆడియెన్స్ ఆదరిస్తారు నాకు తెలుసు. ఇది కూడా అలాంటి మంచి సినిమా. కానీ, ఈ సినిమా మీ అందరికీ రీచ్ అయ్యేలా ఏం చేయాలి. సినిమా బాగుంది. బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఏమైంది' అని సోహైల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
మద్యం పంచిన అవినాశ్: ఈ సినిమాకు జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాశ్ వినూత్న రీతిలో ప్రమోషన్స్ చేశాడు. రోడ్డుపై చక్కర్లు కొడుతూ తమ సినిమా చూడాల్సిందిగా ఆడియెన్స్‌ను కోరాడు. ఈ క్రమంలో అవినాశ్ దగ్గర్లోని ఓ వైన్స్ షాపు వద్దకు వెళ్లి, అక్కడ మందుబాబుల్లో కొందరికి మద్యం పంచిపెట్టాడు.
Bootcut Balaraju Cast: ఈ సినిమాలో జబర్దస్త్ ఫేమ్ ముక్కు అవినాశ్ కీలక పాత్ర పోషించాడు. ఇక హీరోయిన్ అనన్య నాగళ్ల, మేఘ లేఖ, ప్రముఖ కమెడియన్ సునీల్, వెన్నల కిషోర్, సీనియర్ నటి ఇంద్రజ, ఝాన్సీ, బ్రహ్మజీ తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Sohel Mr Pregnant Trailer : ఓ మగాడు ప్రెగ్నెంట్ అయితే.. సోహెల్ ఫన్ విత్ ఎమోషన్!
This Week Release Movies : ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఒకే రోజు 5 సినిమాల రిలీజ్..