ETV Bharat / entertainment

సాయి పల్లవి ఫోన్ నంబర్ కాంట్రవర్సీ!-'అమరన్' టీమ్ ఏం చేసిందంటే? - SIVA KARTHIKEYAN AMARAN MOVIE

ఫోన్‌ నంబర్‌ కాంట్రవర్సీపై స్పందించిన 'అమరన్' టీమ్ - ఓటీటీ వెర్షన్​లో ఏం చేసిందంటే?

Amaran Phone Number Controversy
Siva karthikeyan Amaran Movie (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2024, 3:16 PM IST

Amaran Movie Sai Pallavi Phone Number : 'అమరన్‌' సినిమాలో చూపించిన ఓ ఫోన్‌ నంబర్‌ విషయంలో ఇటీవలె జరిగిన వివాదంపై మేకర్స్​ తాజాగా స్పందించారు. ఈ క్రమంలో ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ వివాదానికి కారణమైన నంబర్‌ను ఓటీటీ వెర్షన్​లో బ్లర్‌ చేసింది. ప్రస్తుతం ఈ టాపిక్ నెట్టింట తెగ వైరల్ అవ్వగా, నెటిజన్లను రకరకాలుగా స్పందిస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే?
'అమరన్​'లోని హే మిన్నలే పాటలో హీరోయిన్‌ ఓ కాగితంపై తన ఫోన్‌ నంబర్‌ రాసి శివ కార్తికేయన్​కు ఇస్తుంది. అయితే ఈ సినిమా విడుదలయ్యాక ఆ నంబర్ సాయిపల్లవిదేనని భావించిన పలువురు అభిమానులు ఆ నంబర్​కు ఫోన్‌ కాల్స్‌ చేయడం మొదలుపెట్టారు. అయితే ఆ నంబర్ తనదేనని, దానికి గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్‌ కాల్స్‌, సందేశాల వస్తున్నానయని, దాని వల్ల తనకు వ్యక్తిగత ప్రశాంతత లేకుండాపోయిందంటూ చెన్నైకు చెందిన విఘ్నేశన్‌ అనే ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

దాదాపు నాలుగు వేల కాల్స్‌ తనకు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు రూ.1.1 కోటి పరిహారం కోరుతూ మూవీ టీమ్‌కు లీగల్‌ నోటీసులను సైతం పంపించాడు. అయినప్పటికీ టీమ్‌ నుంచి స్పందన లేకపోవడం వల్ల ఇటీవల అతడు మద్రాస్‌ హైకోర్టులో ఈ విషయంపై దావా వేశాడు. ఈ క్రమంలోనే తాజాగా టీమ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అలా ఓటీటీ వేదికగా అందుబాటులో ఉన్న ఈ సినిమాలోని ఆ నంబర్‌ను కాస్త బ్లర్‌ చేసింది. అంతేకాకుండా యూట్యూబ్‌లోనూ ఈ పాటకు సంబంధించిన వీడియోలోనూ నంబర్‌ను పూర్తిగా బ్లర్ చేసింది.

ఇక 'అమరన్' సినిమా విషయానికి వస్తే, కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్‌, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమాను రాజ్‌కుమార్‌ పెరియసామి డైరెక్ట్ చేశారు. మేజర్ ముకుంద్ వర‌ద‌రాజ‌న్‌గా శివ కార్తికేయ‌న్‌ తన యాక్టింగ్​తో అబ్బురపరచగా, ఇందు రెబెకా వ‌ర్ఘీస్‌గా సాయిప‌ల్లవి తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా సాయిపల్లవి యాక్టింగ్​కు మంచి మార్కులు పడ్డాయి. క్లైమాక్స్‌లో తన యాక్టింగ్‌తో ఆమె కన్నీళ్లు పెట్టించారని పలువురు నెట్టింట తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. కమల్‌హాసన్‌ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

'సాయి పల్లవి ఫ్యాన్స్ నుంచి ఒకటే కాల్స్- రూ.కోటి నష్ట పరిహారం ఇవ్వాల్సిందే!'

ఆ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్​కు 'అమరన్' హీరో స్పెషల్ గిఫ్ట్ - ఏం ఇచ్చారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.