Sitha Rama Kalyanam Nani : శ్రీ రామ నవమి సందర్భంగా సింగర్ స్మిత నివాసంలో సీతారాముల కల్యాణం కన్నులపండువగా జరిగింది. ఈ నేపథ్యంలో హీరో నాని - అంజనా దంపతులతో పాటు పలువురు సెలబ్రిటీలు సందడి చేశారు. వేద మంత్రాల నడుమ జరిగిన ఈ వేడుకలో స్మిత దంపతులతో పాటు నాని, అంజనా కూడా స్వామివారి వివాహాన్ని జరిపించారు. తలంబ్రాలు పోశారు. ప్రస్తుతం ఈ వీడియోను స్మిత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వేడుకకు అల్లరి నరేశ్ భార్య కూడా హాజరయ్యారు.
జెర్సీ @ 5 - జున్ను స్పెషల్ సర్ప్రైజ్
ఇక హీరో నాని లీడ్ రోల్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ జెర్సీ విడుదలై శుక్రవారంతో ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నాని వైఫ్ అంజనా ఇన్‌స్టా వేదికగా ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు. "తొలిసారి థియేటర్‌లో ఆ సినిమా చూసిన క్షణం నాకింకా గుర్తుంది. ఎన్నిసార్లు చూసినా ఆ సీన్స్ నన్ను ఎమోషనల్ చేస్తాయి. మా అబ్బాయి అర్జున్ ఇప్పుడిప్పుడే 'జెర్సీ' థీమ్ సాంగ్ పియానోపై ప్లే చేయడం నేర్చుకుంటున్నాడు" అంటూ క్యాప్షన్‌ను జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
ఇక జెర్సీ సినిమా విషయానికి వస్తే - ఇందులో నాని శ్రద్ధా శ్రీనాథ్‌తో పాటు సత్యరాజ్, హరీశ్ కల్యాణ్ కీలక పాత్రలు పోషించారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ అందుకుంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో వచ్చిన ఈ మూవీ చూసి ఎంతో మంది ఎమోషనలయ్యారు. 67వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ ఎడిటర్ విభాగాల్లో రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది.
మరోవైపు నాని ప్రస్తుతం 'సరిపోదా శనివారం' షూటింగ్లో బిజీగా ఉన్నారు. వివేక్ ఆత్రేయ రూపొందిస్తున్న ఈ మూవీలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్గా కనిపించనుంది. ఎస్.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నాని రికార్డ్‌ను బ్రేక్ చేసిన టిల్లన్న - ఇక మిగిలింది దేవరకొండనే! - Tillu Square Collections
న్యూయార్క్‌లో 'హాయ్ నాన్న' సందడి - బెస్ట్ యాక్టర్ సహా 11 అవార్డులు సొంతం - Hi Nanna Awards