Single Letter Movies : 2024 దీపావళి బరిలో నిలిచిన టాలీవుడ్ సినిమా 'క' (KA) భార విజయం సాధించింది. అక్టోబర్ 31న రిలీజైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ దక్కింది. టైటిల్ ఒక్క అక్షరమే (Single Word Title) అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే ఇప్పటివరకు ఇలా ఒక్క అక్షరంతో చాలానే సినిమాలు వచ్చాయి. అందులో భారీ విజయం సాధించిన చిత్రాలూ ఉన్నాయి. మరి అవేంటో చూసేద్దామా!
త్రి (3) : స్టార్ హీరో ధనుశ్- శ్రుతి హాసన్ లీడ్ రోల్లో వచ్చిన సినిమా త్రి. రజనీకాంత్ కుమార్తే ఐశ్వర్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. 2012లో రిలీజైన ఈ మూవీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. సినిమాతోపాటు పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి.
వన్ (1) : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా 2014లో సుకుమార్ తెరకెక్కించిన సినిమా వన్. ఈ మూవీతోనే ఆయన కుమారుడు గౌతమ్ తెరంగేట్రం చేశాడు. కృతి సనన్ హీరోయిన్. హాలీవుడ్ రేంజ్లో రూపొందిన ఈ సినిమాకు అప్పట్లో మిక్స్డ్ టాక్ వచ్చింది.
ఐ : కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన సినిమా 'ఐ'. ఈ సినిమాలో విక్రమ్- అమీ జాక్సన్ లీడ్ రోల్లో నటించారు. 2015లో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ అందుకున్నా, మ్యూజికల్ హిట్‌గా నిలిచింది.
అ! : స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో తెరక్కిన సినిమా 'అ!'. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమా తెరకెక్కించారు. 2018లో రిలీజైన ఈ సినిమా డిసెంట్ విజయం ఖాతాలో వేసుకుంది. ఇందులో నిత్యమేనన్, రెజీనా, ఈషా రెబ్బ, మురళీ శర్మ ఆయా పాత్రలు పోషించారు.
వి : నేచురల్ స్టార్ నాని కెరీర్లో కూడా ఒక్క అక్షరం టైటిల్ ఉన్న సినిమా ఉంది. 2020లో ఆయన హీరోగా, మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించిన సినిమా 'వి' (V). సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
సై : దర్శకధీరుడు 2004లో తెరకెక్కించిన సినిమా 'సై'. నితిన్- జెనీలియా లీడ్‌లో నటించారు. అప్పట్లో ఈ మూవీ భారీ సక్సెస్ అందుకుంది.
రా : 2001లో ఉపేంద్ర ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా 'రా'. ఈ సినిమాను కెఎస్ నాగేశ్వరరావు తెరకెక్కించారు. ప్రియాంక త్రివేది హీరోయిన్గా నటించారు. అప్పట్లో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.
'ఆమె కష్టం గురించి చెప్పాలనుకున్నా- నా ఎమోషనల్ స్పీచ్‌కు రీజన్ అదే'