Siddu Jonnalagadda Anupama Parameswaran Movie : లేటెస్ట్ రిలీజ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ వసూళ్లు మంచిగా వచ్చాయి. ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. అనుపమ హీరోయిన్‌గా బోల్డ్ క్యారెక్టర్లో నటించి మెప్పించింది.
ఇకపోతే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోందని మూవీటీమ్ కూడా అధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బుక్ మైషోలో 9.3 రేటింగ్, పేటీఎమ్‌లో 95 శాతం, గూగుల్‌లో 4.7/5, ఐఎమ్‌డీబీలో 8.4/10 ఆడియెన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలిపింది.
కలెక్షన్స్ వివరాల విషయానికొస్తే నార్త్ అమెరికాలో 950కే డాలర్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు తెలిసింది. అంటే 1 మిలియన్ డాలర్స్‌కు చేరువగా ఉంది. ఇంకా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 6.00 కోట్ల వరకు షేర్ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్‌గా అన్ని ఏరియాలూ కలిపి రూ. 8.50 కోట్ల వరకు వచ్చిందట. అలానే ఓవర్సీస్లో డే1 గ్రాస్ రూ.10కోట్ల వరకు ఉందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అయితే ఈ లెక్కలన్నీ చెప్పకుండా ఓవరాల్‌గా ఫస్ట్ డే రూ. 23.7 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని మూవీటీమ్ అధికారికంగా ప్రకటించింది. సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. టిల్లు గాడితో అట్టుంటది, సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
ఇకపోతే ఈ చిత్రాన్ని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల సాంగ్స్, తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. ప్రిన్స్, మురళిధర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
సినిమా రివ్యూ విషయానికొస్తే టిల్లు పాత్రలో సిద్ధు అల్లరి బాగా కనెక్ట్ అయింది. అనుపమ అందచందాలు, కథలోని వినోదం, కొన్ని ట్విస్ట్‌లు చిత్రానికి బలాలుగా నిలిచాయి. అయితే కథ మాత్రం రొటీనే. కాని ఫైనల్‌గా అట్లుంటది టిల్లుతోని అంటూ డబుల్ ఎంటర్‌టైనర్ పంచాడు టిల్లు స్క్వేర్.
టిల్లు స్క్వేర్ మ్యాజిక్ - అనుపమ పాత్ర మిస్ చేసుకున్న హీరోయిన్స్ వీరే! - Tillu Square
షాకింగ్ - ప్రముఖ కోలీవుడ్ విలన్ కన్నుమూత - Daniel Balaji Died