SIDDU JONNALAGADDA ANUPAMA PARAMESHWARAN MOVIE TILLU SQUARE : డీజే టిల్లు - సైలెంట్‌గా రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా. సిద్దూ జోవియల్ రోల్, మాస్ యాక్టింగ్‌తో పాటు నేహా శెట్టి హాట్‌నెస్ ప్రేక్షకుల్లో సినిమాకు ప్రత్యేక గుర్తింపును తెచ్చి పెట్టాయి. ఆ అంచనాలతోనే రెండో పార్ట్ కూడా సిద్ధమై థియేటర్లలోకి వచ్చేసింది. ప్రస్తుతం సూపర్ హిట్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. అయితే మొదటి పార్ట్‌లో ఉన్న అంశాలకు రెట్టించి రెండో పార్ట్‌లో ఉండాలని సినిమా యూనిట్ ప్లాన్ చేసింది. అందుకు తగ్గట్టుగానే కథను రెడీ చేసుకుని హీరోయిన్ల కోసం వెదికితే కొందరు షూటింగ్ మొదలు అయ్యాక, ఇంకొందరు డిస్కషన్స్‌లోనే డ్రాప్ అయిపోయారట.
డీజే టిల్లూ రెండో పార్ట్ టిల్లూ స్క్వేర్‌లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అందరూ అనుకున్నట్లు ఆమె ఫస్ట్ అనుకున్న హీరోయిన్ కానేకాదట. ఈ రోల్ కోసం మొదట శ్రీలలను అడిగారట. ఆమె చేతిలో గుంటూరు కారం లాంటి పెద్ద సినిమాలు ఉండటంతో పాటు కథ అవసరాన్ని బట్టి ఈ సినిమాలో ఎక్కువగా రొమాన్స్ చేయాల్సి ఉందట. దాంతో ఆమె డిస్కషన్స్‌లోనే నో చెప్పేసి ప్రాజెక్టును రిజెక్ట్ చేసింది.
ఆ తర్వాత అనుపమని అనుకున్నారట. కథకు ఓకే చెప్పడం, డేట్స్ ఇవ్వడం అంతా అయిపోయాక ఆమె కూడా నో చెప్పేసిందట. అలా మూడో హీరోయిన్గా మడోన్నా సెబాస్టియన్ అదేనండీ ప్రేమమ్ సినిమాలో చివరి హీరోయిన్, శ్యామ్ సింగరాయ్‌లో లాయర్ పాత్రలో నటించిన మడోన్నాను అడిగారట. ఆమె తరఫు నుంచి ఓకే అని వచ్చినా టెస్ట్ షూట్లో ఆమె పర్‌ఫార్మన్స్ సెట్ కాలేదని పక్కకుపెట్టేశారని తెలిసింది.
ఇక మీనాక్షి చౌదరి ఏమైనా సెట్ అవుతుందేమోనని ప్రయత్నించారట. గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్ అయిన మీనాక్షి కూడా ఎందుకో వర్కౌట్ కాలేదు. చివరకి రిజెక్ట్ చేసిన అనుపమనే అప్రోచ్ అయ్యారు. అలా తనంతట తానే వద్దని చెప్పిన అనుపమ మళ్లీ తిరిగొచ్చి సినిమాలో నటించడంతో టిల్లూ స్క్వేర్ సినిమా పూర్తయింది. ఇక ఈ సినిమాలో అనుపమతో పాటు నేహాశెట్టి, ప్రియాంక జువాల్కర్ కూడా కనిపించారు.
కాగా, సిద్ధు జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ ముందు సూపర్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. మొదటి షో నుంచే మస్త్ కలెక్షన్లను అందుకుంటోంది. దీంతో ఈ చిత్రం డబుల్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది మూవీటీమ్. తొలి రోజే ఈ చిత్రానికి రూ. 23.7 కోట్లు గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు తెలిపింది.
టిల్లు స్క్వేర్ కుమ్మేశాడు భయ్యా - డే 1 ఎన్ని కోట్లంటే? - Tillu Square Day 2 Collections
షాకింగ్ - ప్రముఖ కోలీవుడ్ విలన్ కన్నుమూత - Daniel Balaji Died