ETV Bharat / entertainment

రెండో బాయ్​ఫ్రెండ్​తో శ్రుతి హాసన్​ బ్రేకప్​! - Shruti haasan Break up - SHRUTI HAASAN BREAK UP

Shruti Haasan Break up with Boyfriend : శ్రుతి హాసన్‌ తన బాయ్‌ఫ్రెండ్‌ శాంతనుతో విడిపోయిందని ప్రచారం జరుగుతోంది. ఇన్‌స్టాలో ఒకరినొకరు అన్‌ఫాలో కూడా చేయడం గమనార్హం. పూర్తి వివరాలు స్టోరీలో.

.
.
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 25, 2024, 8:29 PM IST

Shruti Haasan Break up with Boyfriend : ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ కుమార్తెగా శ్రుతి హాసన్ మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కొన్ని సినిమాలతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ఇటీవలే సలార్​తో హిట్‌ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు కొన్ని బడా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ సమయంలో ఆమె బ్రేకప్‌ వార్త నెట్టింట్లో వైరల్‌ మారింది.

శ్రుతి కొన్నేళ్లుగా డూడుల్ ఆర్టిస్ట్ అండ్ ఇలస్ట్రేటర్‌ శాంతను హజారిక(Santanu Hazarika)తో రిలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట విడిపోయిందనే న్యూస్‌ నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. శాంతనుతో కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలను శృతిహాసన్‌ తరచూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకునేది. కానీ ఇప్పుడు పోస్టులు చెయ్యడం లేదు. కొన్ని రోజులుగా సోషల్‌ మీడయాలో యాక్టివ్‌గా కూడా లేదు. ఈ పరిణామాలను బ్రేకప్‌ కారణమని బాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

  • ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిన శ్రుతి
    ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ శాంతను అకౌంట్‌ను శ్రుతి హాసన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసింది. అతను కూడా శ్రుతి అకౌంట్‌ను ఫాలో అవ్వకపోవడం గమనార్హం. ఒకరినొకరు అన్ ఫాలో చేయడం అటుంచితే, శాంతనుతో దిగిన ఫోటోలను కూడా ఆమె డిలీట్ చేసింది.
  • వేర్వేరుగా ఉంటున్న శ్రుతి, శాంతను!
    చాలా మూవీ ఫంక్షన్‌లకు, ఇతర వేడుకలకు శ్రుతి హాసన్‌, శాంతను కలిసి హాజరయ్యేవారు. అయితే 'హీరామండీ' ప్రీమియర్ షోకి ఆమె ఒంటరిగా వచ్చింది. ఇద్దరూ విడిపోయి చాలా రోజులు అయిందని, ఇద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారని సమాచారం. గతంలో పలు సందర్భాల్లో ఇలాంటి రూమర్స్ వస్తే శ్రుతి సోషల్‌ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంపై ఇంకా ఇరు వర్గాల నుంచి ఎటువంటి స్పందన లేదు. కాగా, శ్రుతి హాసన్‌కు ఇది సెకండ్ బ్రేకప్. ఇంతకు ముందు ఇటాలియన్ యాక్టర్ మైఖేల్ కోర్స్ లేతో డేటింగ్ చేశాక విడిపోయింది. ఆ తర్వాత శాంతనుతో ప్రేమలో పడింది.
  • గతంలో రియాక్ట్‌ అయిన శ్రుతి
    ఇంతకు ముందు కూడా శాంతనుతో బ్రేకప్‌ అయిందనే ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలకు చెక్‌పెడుతూ శ్రుతి తన ఇన్‌స్టా స్టోరీలో శాంతనుతో ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. ‘నేను కోరుకునేది ఇదే’ అనే క్యాప్షన్‌ యాడ్‌ చేసింది. ఇన్‌స్టా స్టోరీతో బ్రేకప్‌ వార్తలకు ఎండ్‌ కార్డ్‌ వేసింది. ఇప్పుడు కూడా వస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇస్తుందా? లేదా? అని ఫ్యాన్స్‌ ఆసక్తిగా గమనిస్తున్నారు.

    కెరీర్‌ పరంగా ఇప్పుడు సలార్ 2కు శ్రుతి రెడీ అవుతోంది. అడవి శేష్ పక్కన 'డెకాయిట్' సినిమా చేస్తోంది. కన్నడ స్టార్ యశ్ 'టాక్సిక్', సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న 'కూలి' సినిమాల్లోనూ నటిస్తుందని టాక్ వినిపిస్తోంది.
    పెళ్లి పీటలెక్కనున్న మరో హీరోయిన్​! - Heroine Megha Akash Marriage

'మెగాస్టార్​లా ఖాన్​లు ఆ పాత్ర చేయలేరు' - బాలీవుడ్​ స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్​! - vidya balan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.