Shreya Ghoshal Remuneration: భారత్‌లో టాప్ సింగర్లలో ఒకరు శ్రేయా ఘోషాల్ ఒకరు. మ్యూజిక్ టేస్ట్ ఉన్న ఎవరికైనా ఈమె కచ్చితంగా తెలుసుంటుంది. కాదు కాదు బాగా నచ్చిన గాయకుల్లో టాప్ లిస్టులో ఉంటుంది. ఈ సింగింగ్ సెలబ్రిటీ కెరీర్‌లో సూపర్ హిట్ సాంగ్‌లే ఎక్కువగా ఉంటాయి. దాదాపు రూ.185 కోట్ల ఆస్తిపరురాలైన శ్రేయా అంత సంపాదించడానికి ఒక్కొక్క పాటకు ఎంత ఛార్జ్ చేస్తారంటే తెలుసా?
ఒక్కో పాటను ఎంత చార్జ్ చేస్తారంటే?
తన గానంతో ప్రేక్షకులను మైమరిపించగలిగే ఈ సింగింగ్ సెన్సేషన్ ఒక్కో పాటకు అక్షరాలా రూ.25లక్షలు ఛార్జ్ చేస్తారని టాక్. ఇండియాలోని అత్యంత ఎక్కువ వసూళ్లు చేసే సింగర్లలో శ్రేయా ఘోషల్ ఒకరు. ఆమె ఇండియన్ ఐడల్ 14కు జడ్జిగా కూడా వ్యవహరించారు. హిందీతో పాటు పలు భాషల్లో పాడుతున్న ఈమె కెరీర్‌లో బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ అవార్డుతో పాటు ఐదు నేషనల్ ఫిల్మ్ అవార్డులను సొంతం చేసుకున్నారు.
రీసెంట్‌గా అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లో శ్రేయా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మార్చి 1 నుంచి 3వ తేదీ వరకూ జామ్‌నగర్‌లో జరిగిన ఈ ప్రోగ్రాంలో సింగర్ అర్జీత్ సింగ్‌తో కలిసి పాటలు పాడారు. ఈ మూడు రోజులకు గానూ ఆమె భారీ మొత్తంలో పారితోషికం అందుకున్నారట. కోట్లలో వసూల్ చేసినట్లు టాక్.
శ్రేయా ఘోషాల్ ఆస్తి ఎంతంటే?
బాలీవుడ్‌లో ప్లే బ్యాక్ సింగర్‌గా కెరీర్ ఆరంభించిన శ్రేయా, సంజయ్ లీల భన్సాలీ తెరకెక్కించిన 'దేవదాస్' సినిమాలో తొలిసారి పాడారు. అప్పటి నుంచి తన స్వీట్ వాయీస్తో ఏమాత్రం తగ్గకుండా అలరిస్తూనే ఉన్నారు. 'చిక్నీ చమేలీ' (అగ్నీపథ్), 'యే ఇష్క్ హాయె'(జబ్ వీ మెట్) లాంటి ఎన్నో హిట్ పాటలను ఆమె ఖాతాలో వేసుకున్నారు. రెండు దశాబ్దాలుగా సంగీత ప్రపంచాన్ని ఏలేస్తున్న ఆమె సంపాదన ప్రస్తుతం దాదాపు రూ.180 నుంచి రూ.185 కోట్ల వరకూ ఉండొచ్చని మీడియా వర్గాలు చెబుతున్నాయి.
శ్రేయా ఘోషాల్ కుటుంబం
బంగాల్లోని బెర్హంపుర్‌లో 1984, మార్చి 12న జన్మించిన శ్రేయా తన చిన్ననాటి స్నేహితుడైన శిలాదిత్య ముఖోపాధ్యాయను 2015లో వివాహమాడారు. శిలాదిత్య ట్రూకాలర్‌కు గ్లోబల్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. 2021లో ఈ దంపతులకు తొలి సంతానం కలిగింది. ఆ మగ బిడ్డకు వారు 'దేవయాన్' అని పేరు పెట్టుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">