ETV Bharat / entertainment

కల్కి, ఫైటర్ వసూళ్లను దాటేసిన 'స్త్రీ 2'- బాలీవుడ్ ఆల్​టైమ్ టాప్-10లో శ్రద్ధా మూవీ - Shraddha Kapoor Stree 2 - SHRADDHA KAPOOR STREE 2

Shraddha Kapoor Stree 2: బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ లీడ్ రోల్​లో నటించిన 'స్త్రీ-2' సినిమా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో సినిమా కల్కి, ఫైటర్ రికార్డులు బ్రేక్ చేసింది.

Stree 2 Reocrds
Stree 2 Reocrds (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 16, 2024, 9:25 AM IST

Shraddha Kapoor Stree 2: బాలీవుడ్ బ్యూటీ క్వీన్ శ్రద్ధా కపూర్ లీడ్ రోల్​లో తెరకెక్కిన 'స్త్రీ-2' సినిమా గురువారం గ్రాండ్​గా రీలీజైంది. ఈ నేపథ్యంలో స్త్రీ-2 పలు రికార్డులు బ్రేక్ చేసింది. 2024లో బాలీవుడ్​లో అత్యధిక ఓపెనింగ్స్​ సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా తొలిరోజు రూ.47కోట్లు నెట్ వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ఈ లెక్కన కేవలం ఫస్ట్ డే కలెక్షన్లలోనే కాకుండా ఈ సినిమా ఆల్​టైమ్ హిందీ ఓపెనింగ్స్​ టాప్-10లో స్థానం దక్కించుకుంది. ఈ వసూళ్లతో 'స్త్రీ- 2' 7వ స్థానంలో నిలిచే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో టైగర్- 3, హ్యాపీ న్యూ ఇయర్, భరత్ సినిమాలను వెనక్కినెట్టింది.

ఇక ఇదే ఏడాది రిలీజైన కల్కి, ఫైటర్ (హిందీ) తొలి రోజు కలెక్షన్ల కూడా స్త్రీ-2 దాటేసింది. ఈ సినిమాలు రూ.22- 24కోట్ల మధ్య వసూల్ చేయగా, తాజాగా స్త్రీ-2 రూ.47కోట్లు సాధించింది. అంటే దాదాపు డబుల్ అన్నమాట. కాగా, ప్రీమియర్ షోస్ కూడా కలుపుకుంటే ఈ సినిమా కలెక్షన్లు రూ.55కోట్లు దాటవచ్చని తెలుస్తోంది. అయితే గురువారం ఒక్క రోజే బాలీవుడ్​లో మూడు సినిమాలు విడుదలైనప్పటికీ, పోటీ తట్టుకొని స్త్రీ-2 ఇంత భారీ మొత్తంలో ఒపెనింగ్స్​ దక్కించుకోవడం విశేషం.

కాగా, డైరెక్టర్ అమర్ కౌశిక్ ఈ సినిమాను కామెడీ, హార్రర్ జానర్​లో తెరకెక్కించారు. సినిమాలో శ్రద్ధతోపాటు రాజ్​కుమార్ రావు లీడ్ రోల్​లో నటించారు. మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా స్పెషల్ సాంగ్​లో మెరిసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.