ETV Bharat / entertainment

శర్వా బర్త్​డే సర్​ప్రైజ్​- కుమార్తెను పరిచయం చేసిన హీరో- పేరేంటో తెలుసా? - Sharwanand marriage life

Sharwanand Daughter Name : టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తన పుట్టినరోజున కుమార్తెను పరిచయం చేశారు. సోషల్​ మీడియాలో ఫొటో కూడా షేర్ చేశారు.

Sharwanand Daughter Name
Sharwanand Daughter Name
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 10:29 PM IST

Updated : Mar 6, 2024, 10:38 PM IST

Sharwanand Daughter Name : పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ తన ఫ్యాన్స్​కు సడెన్​ సర్​ప్రైజ్ ఇచ్చారు. తన కుమార్తెను పరిచయం చేశారు. ఈ మేరకు ఫ్యామిలీ పిక్స్ షేర్ చేశారు. అయితే తాను తండ్రి అయిన విషయాన్ని శర్వా ఇప్పటివరకు చెప్పలేదు. అందుకే ఆయన ఫ్యాన్స్‌, నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

శర్వానంద్​కు బర్త్‌డే విషెస్‌తోపాటు ఫాదర్‌ అయినందుకు కంగ్రాట్స్‌ చెబుతున్నారు. తన ముద్దుల కుమార్తెకు లీలా దేవి అని పేరు పెట్టినట్లు శర్వా తెలిపారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన రక్షితను శర్వానంద్‌ గతేడాది పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఉన్న లీలా ప్యాలెస్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నారు శర్వానంద్.

మనమే!
బుధవారం శర్వా పుట్టినరోజు సందర్భంగా అప్‌కమింగ్ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర బృందం ప్రకటించింది. దీనికి మనమే అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుపుతూ ఫస్ట్‌లుక్‌ టీజర్‌ను టీమ్‌ విడుదల చేసింది. ఈ చిత్రంలో చిన్నారి నేపథ్యంలో సాగే సన్నివేశాలు హైలైట్‌ కానున్నట్లు సమాచారం. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లోనూ బాబుతో శర్వానంద్‌ నిల్చున్నట్లు చూపించారు. ఆ బాబు శ్రీరామ్ ఆదిత్య కుమారుడని కూడా టాక్ వినిపిస్తోంది.

'సాహసం చేసేందుకు సిద్ధంగా ఉండండి'
శర్వానంద్​ 36వ సినిమాకు సంబంధించిన అప్డేట్​ కూడా వచ్చేసింది. #Sharwa36 పేరుతో ఇది ప్రచారంలో ఉంది. దీని ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను పంచుకున్న శర్వానంద్‌ సాహసం చేసేందుకు సిద్ధంగా ఉండండి అని క్యాప్షన్‌ పెట్టారు. దీనికి అభిలాష్‌ రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఇది రానుంది. రేసింగ్‌ ఆధారంగా రూపొందించనున్న ఈ సినిమాలో శర్వా బైక్‌ రైడర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయన గతంలో ఈ బ్యానర్‌పై రన్‌ రాజా రన్, ఎక్స్‌ ప్రెస్‌ రాజా, మహానుభావుడు వంటి హిట్‌ సినిమాల్లో నటించారు.

Last Updated : Mar 6, 2024, 10:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.