Sharukh Khan Movie With Stree 2 Director : పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో గతేడాది హ్యాట్రిక్ హిట్ అందుకున్న బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇప్పటివరకు తన కొత్త సినిమాను ప్రకటించలేదు. అయితే ఆయన వచ్చే ఏడాది వరుసగా మూడు చిత్రాలని ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం అందింది. ఇప్పటి వరకు యాక్షన్, ప్రేమ కథలు, కామెడీ ఎంటర్‌టైనర్‌లతో అలరించిన ఆయన ఈ సారి తన కొత్త చిత్రం కోసం సాహసికుడుగా అవతారమెత్తనున్నట్లు తెలిసింది. రీసెంట్‌గానే స్త్రీ 2 చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకున్న దర్శకుడు అమర్ కౌశిక్ ఈ సినిమాను తెరకెక్కిస్తారని సమాచారం. ఈ విషయాన్ని షారుక్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
"ఏడాది పూర్తి అయిపోతున్నా ఇప్పటి వరకు షారుక్ తెరపైకి రాలేదు. అయితే ఆయన వచ్చే ఏడాది వరుసగా మూడు సినిమాలు ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. అందులో ఒకటి అమర్ కౌశిక్‌తో చేయనున్న ప్రాజెక్ట్. కొంత కాలంగా అమర్ కౌశిక్, షారుక్ మధ్య సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో అడ్వెంచర్ మూవీగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందులో అడవుల్లో సాహస యాత్ర చేసే వ్యక్తిగా షారుక్ కనిపించనున్నారు. మునుపెన్నడూ ఆయన ఇలాంటి పాత్ర పోషించలేదు. త్వరలో పూర్తి వివరాలను అఫీషియల్‌గా ప్రకటిస్తారు." అని షారుక్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
Sharukh Khan King Movie : ఇకపోతే షారుక్ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి కింగ్ అనే సినిమా చేస్తున్నట్లు చాలా కాలం నుంచి వార్తలు వస్తున్నాయి. తండ్రీకూతుళ్లు గురుశిష్యులుగా నటించనున్నారట. కానీ ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టును అధికారికంగా చెప్పలేదు. కానీ షారుక్ ఆ మధ్య ఈ సినిమా గురించి మాట్లాడారు. లస్ట్ స్టోరీస్ 2, కహానీ 2, బద్లా నైనా వంటి ప్రాజెక్టులతో దర్శకుడిగా మంచి పేరు సొంతం చేసుకున్న సుజోయ్ ఘోష్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ కీలక పాత్రలో ప్రతినాయకుడిగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ ప్రారంభించనున్నారట.
ప్రభాస్ 'రాజాసాబ్'కు గుమ్మడికాయ కొట్టేది అప్పుడే! - Rajasaab Shooting Update