Sharukh Khan Iconic Pose : బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ అందరికీ సూపరిచితమే. ఈ బాలీవుడ్ బాద్‌షాను తలచుకోగానే కళ్ళ ముందుకు వచ్చేది ‘దిల్‌వాలే దుల్హానియా లేజాయెంగే’లోని ఐకానిక్ పోజ్. ఆ సినిమా విడుదలై సుమారు 30 ఏళ్ళు అయినా అభిమానుల హృదయాలలో ఆ పోజ్ ఇప్పటికీ నిలచిపోయింది. షారుక్ కూడా ప్రతి ఫంక్షన్‌లోనూ ఈ పోజును రీ క్రియేట్ చేసి అభిమానుల్లో జోష్ నింపుతుంటారు. అయితే ఆ పోజ్ వెనక ఒక కథ ఉంది. తాజాగా స్విట్జర్లాండ్‌లో జరిగిన ఓ ఈవెంట్లో షారుక్ తన ఐకానిక్ పోజ్ గురించి సీక్రెట్ బయట పెట్టారు.
అదేంటంటే? - "దిల్‌వాలే దుల్హానియా లేజాయెంగే'లోని ఐకానిక్ పోజ్ అంటే ఎంతో మందికి ఇష్టం. అయితే దానిని మేం ప్రత్యేకంగా క్రియేట్ చేయలేదు. నిజానికి కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ ఒక డ్యాన్స్ మూమెంట్(డిప్) ఇచ్చి ప్రాక్టిస్ చేయమన్నారు. రాత్రంతా ఆ స్టెప్ ప్రయత్నించా. కానీ తర్వాత రోజు సెట్లో నా డ్యాన్స్ మూమెంట్ చూసి సరోజ్ ఖాన్ షాక్ అయ్యారు. తాను హీరోయిన్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ స్టెప్ రూపకల్పన చేశానని, అవి మీకు సూట్ అవ్వడం లేదని చెప్పి అప్పటికప్పడు ఆ స్టెప్‌ను మార్చేశారు. చేతులూ చాపుతూ నిలబడి ఉన్న ఈ ఐకానిక్ పోజు పెట్టించారు. నిజానికి ఈ పోజ్ కోసం అయిత నేను పెద్దగా కష్టపడలేదు. కాళ్లను కూడా అలా కావాలని పెట్టలేదు. చేతులు మాత్రం చాపి కొంచెం నవ్వాను. ఇలా వచ్చేసింది" అని షారూఖ్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. అయితే ఎవరైనా ప్రత్యేకంగా అడిగినప్పుడు మాత్రం కాస్త బిల్డప్ ఇస్తుంటానని చెప్పుకొచ్చాడు బాలీవుడ్ బాద్షా.
ఇక సినిమాల విషయానికొస్తే గతేడాది పఠాన్, జవాన్, డంకీ చిత్రంలో కనిపించారు. పఠాన్, జవాన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలుకొట్టగా డంకీ మాత్రం పర్వాలేదనిపించింది. ఇక ఆయన తన ఇద్దరు తనయులతో కలిసి డబ్బింగ్ చెప్పిన 'ముఫాసా: ది లయన్ కింగ్' డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. అలానే ఆయన కింగ్ అనే సినిమాలోనూ నటిస్తున్నారు.
ఆ విషయంలో షారుక్ ఖాన్‍ను బీట్ చేసిన శోభిత ధూళిపాళ్ల - Sobhita Dhulipala Sharukh Khan
అతడితో రిలేషన్షిప్ - అసలు విషయం బయట పెట్టిన కృతి సనన్ - Kriti Sanon Relationship