ETV Bharat / entertainment

15రోజులు మాకు నిద్ర లేదు: సక్సెస్​మీట్​లో నాని - Saripodhaa Sanivaaram - SARIPODHAA SANIVAARAM

Saripodhaa Sanivaaram Nani: నేచురల్ స్టార్ నాని- వివేక్ ఆత్రేయ కాంబోలో తెరకెక్కిన సినిమా 'సరిపోదా శనివారం'. ఈ సినిమా ఆగస్టు 29న రిలీజై మంచి విజయం అందుకుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ శనివారం సక్సెస్​మీట్ నిర్వహించింది.

Saripodhaa Sanivaaram
Saripodhaa Sanivaaram (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2024, 10:00 PM IST

Saripodhaa Sanivaaram Nani: నేచురల్ స్టార్ నాని 'సరిపోదా శనివారం' సినిమాతో లేటెస్ట్​గా భారీ విజయం ఖాతాలో వేసుకున్నారు. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 29న రిలీజై సూపర్ రెస్పాన్స్​తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో మూవీయూనిట్ శనివారం హైదరాబాద్​లో సక్సెస్​మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్​కు హీరో నాని సహా హీరోయిన్​ ప్రియాంకా మోహన్, సీనియర్ నటుడు సాయికుమార్, దర్శక నిర్మాతలు హాజరై తమ ఆనందం వ్యక్తం చేశారు. ఇక ఈ ఈవెంట్​లో నాని మాట్లాడారు. సినిమా రిలీజ్​కు ముందు ఎంత ఒత్తిడికి గురయ్యారో గుర్తుచేసుకున్నారు.

'పనిచేసే ఒత్తిడిలో సినిమాకు 15 రోజుల ముందు నాతోపాటు మూవీటీమ్​కు కూడా నిద్రలేదు. నేను ప్రమోషన్స్​ కోసం తిరగ్గా, మూవీటీమ్ మిగిలిన పనుల్లో బిజీగా ఉండడంతో నిద్ర లేదు. అప్పుడు ఒత్తడి వల్ల నిద్రలేదు. ఇప్పుడు మళ్లీ మూడు రోజుల నుంచి ఆనందంతో నిద్ర పట్టడం లేదు. పడుకున్నా అరగంటకే లేస్తున్నాను. చాలా ఎగ్జైట్​మెంట్​లో ఉన్నాను. మా సినిమాను అందరూ చాలా బాగా ఆదరించారు. అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్​ షో స్​తో రన్​ అవుతోంది. థాంక్యూ. ఇక సెప్టెంబర్ 5న 'సరిపోదా శనివారం' గ్రాండ్​ సక్సెస్ మీట్ ఉంటుంది' అని నాని అన్నారు.

డైరెక్టర్ వివేక్ కూడా ఈవెంట్​లో మాట్లాడారు. తనపై ఆయన కంటే నానికే ఎక్కువ నమ్మకం అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 'ఆనందంతో మాటలు రావడం లేదు. నాపై నాకున్న నమ్మకం కంటే నానికి నాపై ఉన్న నమ్మకం ఎక్కువ. ఇంట్రో సీన్‌లో సగం గడ్డంతో కనిపించాలని చెప్పినప్పుడు ఆయన ఏమాత్రం సంకోచించలేదు. చేసేద్దాం అన్నారు. ఆయన అంత స్వేచ్ఛ ఇచ్చారు. నన్ను నమ్మి ఈ స్కేల్‌లో బడ్జెట్‌ పెట్టిన నిర్మాత దానయ్యకు ధన్యవాదాలు. ఈ మూవీలో నేను బాగా ఎంజాయ్‌ చేసిన రాసిన పాత్రలు ఒకటి సూర్య, మరొకటి దయానంద్‌. ఎస్‌.జె.సూర్యకు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే సంతోషంగా ఉంది. ఆ పాత్రకు ప్రాణం పోశారు' అని వివేక్‌ అన్నారు.

ఎస్​ జే సూర్య - 'వస్తాడు, సైకోయిజంతో అలరిస్తాడు, రిపీట్​' - SJ Suryah Saripoda Sanivaram

'సరిపోదా శనివారం' బాక్సాఫీస్ రిపోర్ట్​ - ఫస్డ్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే? - Saripoda Sanivaram Collections

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.