ETV Bharat / entertainment

'నేను నమ్మకంగా చెప్తున్నా - కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సినిమా సరిపోదా శనివారం' - Nani Saripodhaa Sanivaaram - NANI SARIPODHAA SANIVAARAM

Saripodhaa Sanivaaram Pre Release Event : నేచురల్ స్టార్ నాని త్వరలో 'సరిపోదా శనివారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్​లో సందడి చేశారు. ఆ విశేషాలు మీ కోసం

Saripodhaa Sanivaaram
NANI (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2024, 10:28 AM IST

Saripodhaa Sanivaaram Pre Release Event : నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్​లో తెరకెక్కుతున్న 'సరిపోదా శనివారం' సినిమా ఆగస్టు 29న థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రీ రిలీజ్​ ఈవెంట్​లో మూవీటీమ్​ పాల్గొని సందడి చేసింది. సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చింది.

కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సినిమా
"కొవిడ్‌ తర్వాత ఆడియెన్స్ థియేటర్లకు రావట్లేదని చాలామంది అంటున్నారు. మంచి సినిమా తీస్తే తప్పకుండా వస్తారు, ఇంకా వస్తూనే ఉంటారు. ఈసారి మాత్రం మిస్‌ అవ్వదు. నేను ఈ మాట చాలా నమ్మకంగా చెబుతున్నాను. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సినిమా 'సరిపోదా శనివారం'. ఇక వివేక్‌ ఆత్రేయ కెరీర్‌లో ఇది ఓ మైల్​స్టోన్​గా నిలుస్తుంది. డి.వి.వి. దానయ్యను వెతుక్కుంటూ వచ్చిన మరో మంచి సినిమా ఇది" - హీరో నాని

సూర్య - చారు అలా గుర్తుండిపోతారు
ఇదే వేదికపై హీరోయిన్ ప్రియాంక మోహన్‌ కూడా సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పుకొచ్చారు. "నానితో నేను చేస్తున్న రెండో సినిమా ఇది. 'గ్యాంగ్‌లీడర్‌'లో పెన్సిల్, ప్రియ పాత్రలు ఎలా అయితే ఆకట్టుకున్నాయో, ఇప్పుడు 'సరిపోదా శనివారం' సినిమాలోని సూర్య - చారు పాత్రలు కూడా ప్రేక్షకులకు అలానే గుర్తుండిపోతాయి" - హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్‌.

నాని నాకు అవకాశం కాదు కాన్ఫిడెన్స్ ఇచ్చారు
"అంటే సుందరానికీ! తర్వాత ఎటువంటి సినిమా చేయాలో నాకు అర్థం కాలేదు. అందరూ నాని నీకు అవకాశం ఇచ్చారని అంటున్నారు. అది చాలా చిన్నపదం. నాని నాకు కాన్ఫిడెన్స్​ ఇచ్చారు. ఆయనతో ఇంకా చాలా సినిమాలు చేయాలని ఉంది" - డైరెక్టర్ వివేక్ ఆత్రేయ

అన్ని విషయాలు నానినే చూసుకుంటారు
"నానితో సినిమా చేస్తే ప్రొడ్యూసర్​పై ఎటువంటి ప్రెజర్ ఉండదు. అన్ని విషయాలను ఆయనే దగ్గరుండి చూసుకుంటారు. ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లే హీరో ఆయన. ఇక ఈ సినిమా తర్వాత ఎస్‌.జె.సూర్య ఇంకా ఎక్కువగా బిజీ అవుతారు. అంతేకాకుండా వివేక్‌ ఆత్రేయ ఈ సినిమాతో కమర్షియల్‌ డైరెక్టర్‌ అవుతారు"- నిర్మాత డి.వి.వి.దానయ్య.

ఇదిలా ఉండగా, ఈ ఈవెంట్​కు మూవీ టీమ్​తో పాటు డైరెక్టర్స్​ శైలేష్‌ కొలను, దేవా కట్టా, శ్రీకాంత్‌ ఓదెల, శౌర్యువ్, ప్రశాంత్‌ వర్మ, నటులు అదితి, అలీ, అభిరామి, అనిత చౌదరి, నాగమహేశ్, బేబి ఖ్యాతి, జోష్‌ రవి, వినయ్‌ మహదేవ్, సినిమాటోగ్రాఫర్ మురళి, ఆర్ట్ డైరెక్టర్ శేఖర్‌, మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్‌ బిజోయ్, తదితరులు పాల్గొన్నారు.

టైటిల్​లో 'శనివారం'- రిలీజ్ 'గురువారం-' ఎందుకలా?- నాని ఆన్సర్ ఇదే - Nani Saripodhaa Sanivaraam

'నాని, పవన్ కల్యాణ్ మధ్య ఉన్న పోలిక అదే!' : ప్రియాంక మోహన్‌ - Saripodhaa Sanivaaram Priyanka

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.