ETV Bharat / entertainment

జాన్వీ కపూర్​తో మూవీ సెట్ అయిందా? - నాని సమాధానమిదే - Nani Janhvi kapoor - NANI JANHVI KAPOOR

Nani Janhvi kapoor : తన అప్​కమింగ్ ప్రాజెక్ట్​లో హీరోయిన్ జాన్వీ కపూర్ నటించనున్నట్లు వస్తోన్న వార్తలపై హీరో నాని స్పందించారు. ఏం చెప్పాంటే?

source ETV Bharat and Getty Images
Saripoda Sanivaram Nani Janhvi kapoor (source ETV Bharat and Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 26, 2024, 8:50 AM IST

Saripoda Sanivaram Nani Janhvi kapoor : 'సరిపోదా శనివారం'తో థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు హీరో నాని. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. ఈ నెల 29న రిలీజ్​ కానుందీ చిత్రం. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని తన కొత్త సినిమాకు సంబంధించి కొద్ది రోజులుగా వస్తోన్న రూమర్స్‌కు ఫుల్ స్టాఫ్​ పెట్టారు. తన అప్​కమింగ్ మూవీలో జాన్వీ కపూర్‌ నటించనుందని వస్తోన్న ప్రచారంపై స్పందించారు.

"నా తర్వాతి సినిమాలో జాన్వీ నటించనుందని వస్తున్న వార్తలు కేవలం రూమర్‌ మాత్రమే. బహుశ ఆమెను తీసుకోవడం కోసం చర్చలు జరుగుతూ ఉండొచ్చు. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ అవుతోంది. నేను కొద్ది రోజులుగా వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్నాను. అందుకే ఆ ప్రాజెక్ట్‌ గురించి ప్రస్తుతానికి వివరాలు క్లారిటీగా తెలుసుకోలేకపోతున్నాను" అని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశముంది.

కాగా, నాని - దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్​లో నిర్మాత చెరుకూరి సుధాకర్ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలోనే జాన్వి కపూర్​ను హీరోయిన్​గా తీసుకోబోతున్నట్లు ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. గతంలో నాని - శ్రీకాంత్ కాంబోలో వచ్చిన దసరా చిత్రం రూ.100 కోట్ల భారీ సక్సెస్​ను సాధించింది.

ఇకపోతే బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్​ టాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలను అందుకుంది. త్వరలోనే రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. దేవరలో ఎన్టీఆర్‌ సరసన నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని సాంగ్స్​ బాగా ట్రెండ్ అయ్యాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సెప్టెంబర్‌ 27న మొదటి భాగం రిలీజ్​ కానుంది.

ఇంకా బుచ్చిబాబు- రామ్‌ చరణ్‌ కాంబోలో రానున్న సినిమాలోనూ జాన్వీ కపూర్ నటించనుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. కామెడీ జానర్‌లో ఇది రానుందని రామ్ చరణ్ ఆ మధ్య చెప్పారు. అలానే నానితోనూ ఆమె నటించే అవకాశముందని ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఇది ఒకే అయితే ఆమెకు ఇది మూడో చిత్రం అవుతుంది.

కొత్త ప్రేమలో అలియా భట్​ - రహస్యాల వేటలో కరీనా - Bollywood Latest Updates

'తంగలాన్'​ దర్శకుడితో సూర్య - పొల్లాచ్చిలో వెంకీ పాట - Thangalan Director Suriya Movie

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.