Sanjay Leela Bhansali Heera Mandi : విలక్షణ నటుల్లోని కొత్త కోణాన్ని ఆవిష్కించేవాళ్లలో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ఆయన సినిమాల్లో భారీ సెట్స్‌తో పాటు తారాగణం కూడా ఓ రేంజ్లో ఉంటుంది. ఖామోషీ అనే సినిమాతో తన సినీ జర్నీని ప్రారంభించిన ఈ స్టార్ డైరెక్టర్ ఇప్పటి వరకు ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సినిమాలను అందించారు. ఆయన డైరెక్టర్‌గానే కాకుండా రైటర్‌గా, నిర్మాతగా పలు ప్రతిష్టాత్మక చిత్రాలను తెరకెక్కించారు.
ఇటీవలే 'హీరామండి : ది డైమండ్ బజార్' అనే వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. ఆయన డైరెక్ట్ చేసిన తొలి సిరీస్ కూడా ఇదే కావడం విశేషం. భారీ తారాగణంతో పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్‌లో స్వాతంత్ర్యానికి ముందు పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న పరిస్థితులను చూపించారు. ఆ ప్రాంతంలో ఉన్న వేశ్యలు హీరామండి ఉండేవారట. ఆ సమయంలో జరిగిన పలు సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ప్రస్తుతం ఈ సిరీస్‌కు నెట్టింట మంచి రెస్పాన్స్ వస్తోంది.
అయితే ఆయన తెరకెక్కించే పలు సినిమాల్లో వేశ్యల గురించి కొన్ని సీన్స్‌ను ఆయన సినిమాలో చూపిస్తుంటారు. గతంలో విడుదలై 'గంగూబాయ్ కఠియావాదీ', 'కలంక్', 'దేవదాస్' లాంటి సినిమాల్లో ఆయన ఈ విషయం గురించి ప్రస్తావించారు. అయితే ఆయన తీసిన ప్రతి సినిమాలో ఈ పాత్రల గురించి ఎందుకు చూపిస్తారు. దీని వెనకున్న అసలు కారణమేంటంటే ?
ఈ ప్రశ్నకు సంజయ్ లీలా భన్సాలీ ఓ పాత ఇంటర్వ్యూలో బదులిచ్చారు. ముంబైలోని రెడ్ లైడ్ ఏరియాలోని కమాటిపుర దగ్గర పెరిగారు బన్సాలీ. అక్కడి స్త్రీల జీవితాలను దగ్గర ఉండి చూశారు. అలాంటి విషయాలు చిన్నప్పుడు చూసేవారు చాలా సున్నితంగా ఉంటారు అంటూ తన చిన్ననాటి జ్నాపకాలను గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
మే 1న విడుదలైన ఈ పీరియాడికల్ డ్రామా మూవీలో సోనాక్షి సిన్హా, రిచా చద్దా, అదితి రావ్ హైదరీ, సంజీదా షేక్, మనీషా కొయిరాలా, షర్మిన్ సెగల్, తాహా షా బాదుషా, ఫరీదా జలాల్, శ్రుతి శర్మ, జయతి భాటియా, నివేదిత భార్గవ నటించారు. సుమన్, శేఖర్ సుమన్, ఫర్దీన్ ఖాన్, వైష్ణవి గణత్ర తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఈ వారం అందరి ఫోకస్ ఆ 5 చిత్రాలపైనే! - This week Movie Releases