ETV Bharat / entertainment

మెగాస్టార్ సినిమాలో సమంతకు ఛాన్స్​! - Samantha New Movie - SAMANTHA NEW MOVIE

Mammootty Samantha : హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం కొత్త చిత్రాలను లైన్​లో పెట్టే పనిలో ఉందట. అలా తాజాగా ఆమె మెగాస్టార్​తో సినిమా చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం అందింది. పూర్తి వివరాలు స్టోరీలో.

Source ETV Bharat
samantha (Source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 13, 2024, 1:11 PM IST

Mammootty Samantha : కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న హీరోయిన్ సమంత​ ప్రస్తుతం కొత్త చిత్రాలను లైన్​లో పెట్టే పనిలో ఉందట. అలా తాజాగా ఆమె మాలీవుడ్​ మెగాస్టార్​తో సినిమా చేసేందుకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మమ్ముట్టి ఫుల్ ఫామ్​లో ఉంటూ వివిధ జానర్​లలో సూపర్ హిట్‌లు అందుకుంటున్నారు. రీసెంట్‌గా ఆయన తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్‌తో ఓ చిత్రం చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రంలోనే సమంతను హీరోయిన్‌గా తీసుకోవాలని చర్చలు జరుగుతున్నాయట.

ఒకవేళ ఇదే కనుక నిజమై సమంత కన్ఫామ్ అయితేే ఆమెకు ఇది బంపర్ ఆఫరే అని చెప్పాలి. అలానే గౌతమ్ మేనన్‌తో ఆమెకు ఇది హ్యాట్రిక్ సినిమా అవుతుంది. గతంలో గౌతమ్ మేనన్ దర్శకత్వంలో 'ఏమాయ చేశావే', 'ఎటో వెళ్లిపోయింది మనసు' చిత్రాలతో సామ్ మంచి పేరు సంపాదించుకుంది. ఇందులో ఏమాయ చేశావే సమంతకు డెబ్యూ మూవీ.

కాగా, మమ్ముట్టి చేయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 15న చెన్నైలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. జూన్ 20న మమ్ముట్టి సెట్స్‌లో జాయిన్ అవుతారట. మమ్ముట్టినే దీన్ని నిర్మిస్తున్నారు. ఇకపోతే గతంలో మమ్ముట్టి- సమంత కలిసి ఓ యాడ్‌లో నటించిన సంగతి తెలిసిందే.

ఫుల్ ఫామ్​లో మమ్ముట్టి - మెగాస్టార్ మమ్ముట్టి రీసెంట్​గా టర్బోతో మంచి విజయాన్ని అందుకున్నారు. అంతకుముందు 'భ్రమయుగం' చిత్రంతోనూ బ్లాక్ బస్టర్ హిట్​ను ఖాతాలో వేసుకున్నారు. ఇలా వరుసగా సూపర్ హిట్స్ సాధిస్తూ హిట్ ట్రాక్‌ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 'కడుగన్నావా ఒరు యాత్ర', 'బజూకా' చిత్రాలలోనూ నటిస్తున్నారు. మరోవైపు సమంత 'సిటాడెల్: హనీ బన్నీ'(Samantha Citadedl Webseries) అనే బాలీవుడ్​ సిరీస్ చేసింది. వరుణ్ ధావన్ లీడింగ్ రోల్‌లో పోషించిన ఈ సిరీస్ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇందులో సామ్ యాక్షన్ అదరగొట్టేసిందని మూవీటీమ్ చెబుతోంది. కానీ ఇంకా ప్రమోషన్స్​ ఏమీ ప్రారంభించలేదు.

హ్యాపీ బర్త్​డే రాక్సీ - 'కల్కి'లో దిశా పటానీ పాత్ర ఇదే

ఓవర్సీస్​లో 'కల్కి' జోరు - RRR రికార్డ్​ బ్రేక్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.