Samantha Health Podcast : స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరుస సినిమాలతో అలరించిన ఈమె ప్రస్తుతానికి ఒక ఏడాది నుంచి రెస్ట్ మోడ్‌లోనే ఉంటోంది. మయోసైటిస్ వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ దీంతో పాటే మానసిక ప్రశాంతత అవసరమని తన షూటింగ్స్‌కు ఏడాది పాటు ఫుల్ స్టాప్ పెట్టేసింది.
అయితే ఈ రెస్ట్ మోడ్‌ను వెకేషన్ మోడ్‌గా మార్చుకొని తనకిష్టమైన ప్రదేశాలను చుట్టేస్తూ లైఫ్‌ను సరదాగా గడుపుతోంది సామ్. సిల్వర్ స్క్రీన్‌పై కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం తాను చేస్తున్న, చూస్తున్న ప్రతి విషయం గురించి ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంది. మధ్య మధ్యలో లైట్ హాట్ టచ్‌తో ఫోటోషూట్స్ కూడా చేస్తోంది.
ఇక ఈ మధ్యనే బ్యాక్ టు వర్క్ మోడ్‌లోకి అడుగుపెట్టింది సామ్. ఇండియెన్ వెర్షన్ సిటాడెల్ డబ్బింగ్ వర్క్‌తో ప్రొఫెషనల్ వర్క్‌ను షురూ చేసింంది. తన కొత్త సినిమాలపై దృష్టిని పెడుతోంది. ఈ క్రమంలోనే వాలంటైన్స్ డే సందర్భంగా అభిమానులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చింది సామ్. అసలే ఈ మధ్యకాలంలో పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్స్ ఎక్కువగా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా సామ్ కూడా టేక్ 20 అనే పాడ్ కాస్ట్‌ను ప్రారంభించింది. ఇందులో కేవలం ఆరోగ్యానికి సంబంధించిన సూత్రాలు మాత్రమే ఉంటాయని చెప్పుకొచ్చింది. మూడేళ్ళుగా మయోసిట్ ద్వారా తాను అనుభవించిన బాధ, ఎలా కోలుకుందో వంటి విషయాలను తెలిపింది. మొత్తంగా ఈ టేక్ 20లో హై క్వాలిటీ వెల్నెస్ కంటెంట్ ఉంటుందని, అది అందరి జీవితాలను మార్చే విధంగా ఉంటుందని వెల్లడించింది. ఈ పాడ్‌కాస్ట్‌లో చెప్పేవన్నీ ఎన్నో ఏళ్లుగా రీసెర్చ్ చేసినవని, అనుభవజ్ఞుల నుంచి తీసుకున్న సలహా సూచనలు అని వివరించింది. దీనికి సంబంధించిన ప్రోమోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. త్వరలోనే ఫిబ్రవరి 19న ఫుల్ వీడియోను రిలీజ్ చేయనుంది.
ఇక సమంత సినిమాలు విషయానికొస్తే త్వరలోనే ఆమె సిటాడెల్(Samantha Citadel Webseries) వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత ఆమె ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ చేయనుందని ఆ మధ్య ప్రచారం సాగింది.
'నేను ఓ కారణజన్ముడ్ని' - క్రేజీగా 'టిల్లు స్క్వేర్' ట్రైలర్
హృతిక్ రోషన్‌కు తీవ్ర గాయాలు - ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్‌కు బ్రేక్