ETV Bharat / entertainment

మిస్టీరియస్​ థ్రిల్లర్ 'తుంబాద్‌' డైరెక్టర్​తో సమంత కొత్త ప్రాజెక్ట్​​ - హీరో ఎవరంటే? - Samantha New Series - SAMANTHA NEW SERIES

Samantha Tumbaad Director Series : హీరోయిన్ సమంత కొత్త సిరీస్​కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. సూపర్ హిట్ మిస్టీరియస్​ థ్రిల్లర్​ తుంబాద్​ దర్శకడు దీన్ని తెరకెక్కించనున్నారు. పూర్తి వివరాలు స్టోరీలో

Source ANI
Samantha New movie (Source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 3:42 PM IST

Updated : Jul 20, 2024, 3:49 PM IST

Samantha Tumbaad Director Series : ఏడాది కాలం పాటు సినిమా షూటింగ్​లకు బ్రేక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ సమంత ఇక తన కొత్త చిత్రాలపై ఫోకస్​ పెట్టేందుకు సిద్ధమైంది. షూటింగ్​లలో పాల్లొనేలా ప్రణాళిక రిచించుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇప్పటికే తన సొంత బ్యానర్​లో ఓ సినిమాను అనౌన్స్​ చేసిన సామ్​, దర్శకద్వయం రాజ్ అండ్ డీకేతో కలిసి మరో ప్రాజెక్ట్​ చేయనున్నట్లు ఆ మధ్య జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే.

తాజాగా ఆ ప్రాజెక్ట్​కు సంబంధించిన వివరాలు బయటకొచ్చాయి. Tentatively #RakhtBrahmand పేరుతో ఈ సిరీస్ రానుందట. దీనికి రాజ్​ అండ్ డీకే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సూపర్ హిట్ ఫిల్మ్​ తుంబాద్​ డైరెక్టర్​ రహిఅనిల్ బార్వే ఈ సిరీస్​ను డైరెక్ట్ చేస్తున్నారు. పీరియడ్ ఫాంటసీ సిరీస్​గా దీన్ని రూపొందిస్తున్నారని తెలిసింది. ​ నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో సమంతతో పాటు బాలీవుడ్ నటులు ఆదిత్య రాయ్​ కపూర్​, వామికా గబ్బి కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

సిరీస్‌ కాన్సెప్ట్‌ ఏంటంటే? - ఇప్పటివరకు ఇండియన్​ సినిమా తెరపై కనిపించని సరికొత్త కథాంశంతో ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారట. మరో సరికొత్త ఊహా ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నారని అంటున్నారు. మోసం, నమ్మకద్రోహం, ప్రేమ, త్యాగం ఇలా పలు అంశాలను మేళవించి దీన్ని తీర్చిదిద్దుతున్నారట.

Raj And DK Movies : కాగా, గతంలో రాజ్ అండ్ డీకే ది ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్​ వంటి సిరీస్​లతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత కూడా నటించింది. ​అలానే రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన సిటాడెల్​లోనూ(Raj And DK Samantha Citadel series) సామ్ నటించింది. త్వరలోనే ఇది రిలీజ్ కానుంది. ఇకపోతే రహిఅనిల్ కూడా తుంబాడ్​ మంచి పేరు సంపాదించుకున్నారు. విమర్శకులను సైతం మెప్పించిన మైథలాజికల్ హారర్‌ తుంబాడ్​లో అత్యాశ మనిషిని ఎలాంటి పరిస్థితికి దిగజారుస్తుందో చక్కగా చూపించారు.

ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్​కు రెడీ - ఎప్పుడంటే? - Tollywood Boxoffice Rereleases

'కల్కి'నే మించేలా త్రివిక్రమ్​-బన్నీ ప్లాన్ - డబ్బులు వెతుక్కొనే పనిలో అల్లు అరవింద్! - Alluarjun Trivikram Movie

Last Updated : Jul 20, 2024, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.