salman khan shooting case : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాస్ పై కొద్ది రోజుల క్రితం దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తనపై జరిగిన ఆ దాడికి భయపడి సల్మాన్ తాను ఉంటున్న ఇంటి నుంచి వేరే ఇంటికి మారనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై సల్మాన్ సోదరుడు అర్భజ్ ఖాన్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు.
"ఇల్లు మారితే సమస్య తీరిపోదు కదా. చోటు మారినంత మాత్రాన బెదిరింపులు ఆగిపోతాయని మీరు అనుకుంటున్నారా? అలా జరుగుతుంది అంటే ఇల్లు మారడం మంచిదే. కానీ వాస్తవానికి ఇప్పుడు అలా జరగడం లేదు కదా. ఇక్కడికి వచ్చిన దుండగులు కొత్త చోటుకు రారని ఏం లేదు కదా. ఇక్కడ విషయం ఏంటంటే. ఈ ఇంట్లో మా నాన్న ఏన్నో ఏళ్ల నుంచి ఉంటున్నారు. సల్మాన్ ఖాన్ కూడా ఎంతో కాలంగా ఇక్కడే నివసిస్తున్నారు. అది తన ఇల్లు. తన ఇంటి నుంచి వెళ్లమని సల్మాన్‌కు ఎవరూ చెప్పరు. అలాంటిది ఇప్పుడు ఈ బెదిరింపుల కారణంగా ఇక్కడి నుంచి వేరే చోటుకు వెళ్లాలని మేం అనుకోవడం లేదు." అని అర్భాజ్ ఖాన్ అన్నారు.
అంతేకాదు "ఇలాంటి వాటికి భయపడుతూ బతికితే ఏం వస్తుంది? ఇంటి నుంచి బయటకు కూడా వెళ్లకుండా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు మేం చేయాల్సిందల్లా ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీతో మరింత జాగ్రత్తగా ఉండటం. సాధ్యమైనంత వరకూ కొద్ది రోజులు సాధారణంగా బతకడం." అంటూ అర్భజ్ చెప్పుకొచ్చారు.
కాగా, ఏప్రిల్ 14, ఉదయం 5గంటలకు బాంద్రా ప్రాంతంలోని సల్మాన్ నివాసమైన గెలాక్సీ అపార్ట్ మెంట్స్ వద్దకు మోటారు బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం దుండగులు ముసుగులు, క్యాపులు ధరించి వచ్చారు.
కేవలం సంచలనం సృష్టించేందుకే సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపారనే అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ఆ తర్వాత ఈ కేసు విషయంలో ఇద్దరు అనుమానితులను అదుపులో తీసుకున్నారు. అంతేకాదు ఈ ఘటన వెనక గ్యాంగ్ స్టర్ లారెస్ బిష్ణోయ్, అతని సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.
సుహాస్ కోసం రంగంలోకి సుకుమార్ - మ్యాటర్ ఏంటంటే? - Suhas Prasanna vadanam
ఇండస్ట్రీలోకి అబ్బాయిగా ఎంట్రీ - ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్గా ఇమేజ్! - AHSAAS CHANNA