SAIPALLAVI RAMAYANA MOVIE : వరుస సినిమాలతో బిజీగా గడుపుతోన్న హీరోయిన్ సాయి పల్లవి, ప్రస్తుతం బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణలో సీతగా నటిస్తోంది. అయితే, ఈ చిత్రం కోసం సాయి పల్లవి తన అలవాట్లను మార్చుకుందంటూ వార్తలు వచ్చాయి. తాజాగా వీటిపై ఆమె కాస్త ఘాటుగా స్పందించింది. ఇలాంటి నిరాధారమైన వార్తలను వ్యాప్తి చేస్తే, లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
అసలేమని వార్తలు వచ్చాయంటే?
రామాయణ సినిమా పూర్తయ్యేవరకు సాయి పల్లవి మాంసాహారం మానేశారని, హోటల్స్‌లో కూడా తినడం లేదని కోలీవుడ్‌లోని ఓ ప్రముఖ మీడియా సంస్థ వార్తలు రాసింది. సాయి పల్లవి విదేశాలకు వెళ్లేటప్పుడు కూడా వంట వాళ్లను వెంట తీసుకెళ్తుందని అందులో రాసి ఉంది. దీనిపైనే సాయిపల్లవి తాజాగా స్పందించింది. ఇలాంటి నిరాధారమైన రూమర్స్ రాస్తే, ఎంత పెద్ద సంస్థ అయినా లీగల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పింది.
"నాపై ఎన్నో సార్లు రూమర్స్ వచ్చాయి. వస్తున్నాయి. కానీ నేను ప్రతిసారీ మౌనంగానే ఉన్నాను. ఎందుకంటే నిజం ఏంటనేది దేవుడికి తెలుసు. కానీ ఇలా మౌనంగా ఉంటున్నానని రూమర్స్ ఎక్కువగా రాసేస్తున్నారు. ఇప్పుడు వాటిపై స్పందించాల్సిన సమయం వచ్చింది. నా సినిమాల రిలీజ్లు, నా ప్రకటనలు, నా కెరీర్, ఇలా నాకు సంబంధించి ఏదైనా నిరాధారమైన వార్తలు రాస్తే, చట్టబద్దమైన యాక్షన్ తీసుకుంటాను. అది గుర్తింపుపొందిన మీడియా సంస్థ అయినా లీగల్ యాక్షన్ తీసుకుంటాను. ఇన్నాళ్లు సహించాను. ఇకపై ఇలాంటి చెత్త వార్తలను మోసుకెళ్లడానికి నేను సిద్ధంగా లేను" అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
SaiPallavi Upcoming Movies : సాయి పల్లవి సినిమాల విషయానికొస్తే, రీసెంట్‌గానే శివ కార్తికేయన్‌తో కలిసి 'అమరన్' చిత్రంతో భారీ విజయాన్ని అందుకుందామె. ప్రస్తుతం తెలుగులో తండేల్ చిత్రంలో నటిస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటిస్తోన్న చిత్రమిది. మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న బాక్సాఫీస్ ముందు రిలీజ్ కానుంది.
బస్కండక్టర్గానే కాదు ఆ పనులు కూడా చేసిన రజనీకాంత్! - మీకు తెలుసా?
గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ 2024 - టాప్‌లో పవన్ కల్యాణ్, IPL!