ETV Bharat / entertainment

సాయి పల్లవి సినిమా రీ రిలీజ్​ - ఐదు రోజుల్లో రికార్డ్ రేంజ్​ కలెక్షన్స్​! - ప్రేమమ్​ మూవీ రీరిలీజ్ కలెక్షన్స్

హీరోయిన్​ సాయిపల్లవి నటించిన ఓ సినిమా ప్రస్తుతం రీరిలీజై భారీ వసూళ్లను అందుకుంటోంది. కోట్ల రూపాయల కలెక్షన్లను ఖాతాలో వేసుకుంటోంది. ఇంతకీ ఆ చిత్రం ఏంటి? దాని వివరాలను తెలుసుకుందాం.

సాయి పల్లవి సినిమా రీ రిలీజ్​ - ఐదు రోజుల్లో ఏకంగా ఎన్ని కోట్లంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 8:29 AM IST

Saipallavi Premam Movie Rerelease Collections : మలయాళం కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ మూవీ 'ప్రేమమ్'. ఈ సినిమా అపట్లో ఎంతటి విజయం సాధించిందో సినీ ప్రేక్షకులకు తెలిసిన విషయమే. ఇందులో మలయాళ హీరో నవీన్ పాల్​, సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్​, మడోన్నా సెబాస్టియన్​ కలిసి నటించారు. ఈ చిత్రంలో ఓ యువ‌కుడి జీవితంలో మూడు ద‌శ‌ల్లో సాగిన ప్రేమాయ‌ణాన్ని అద్భుతంగా చూపించారు. అయితే ఇప్పుడీ సినిమా రీరిలీజ్​లో అద్భుత కలెక్షన్లను అందుకుంటోంది. ఫిబ్రవరి 1వ తేదీన మలయాళం సహా తమిళంలో మరోసారి థియేటర్లలో విడుదలైంది. రెండు చోట్ల చిత్రానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. విడుదలైన ఐదు రోజుల్లోనే రెండు కోట్లకుపైగా వసూళ్లను అందుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తమిళం, మలయాళంలో రీ రిలీజ్ అయిన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా ప్రేమమ్​ నిలవనుంది.

అయితే ప్రేమమ్ చిత్రం థియేటర్లలో రీరిలీజ్ కావడం ఇదేం తొలిసారి కాదు. మొత్తంగా మూడోసారి. 2016లో వాలెంటైన్స్ డే సందర్భంగా ఓ సారి, అలాగే 2017లోనూ మరోసారి, ఇప్పుడు దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత మరోసారి రీరిలీజ్ అయింది. మూడుసార్లు ఈ చిత్రానికి మంచి క్రేజ్ దక్కింది.

Premam Movie Saipallavi : ఈ చిత్రాన్ని ఆల్ఫోన్సో పుత్రేన్ తెరకెక్కించారు. కేవలం నాలుగు కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.75కోట్ల వరకు అప్పట్లో వసూలు చేసింది. మలయాళ, తమిళనాడులోని పలు థియేటర్లలో 200 రోజులకుపైగా ఆడింది. ఈ చిత్రంతోనే సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి పరిచయమయ్యారు. తెలుగులో ప్రేమమ్​ పేరుతో రీమేక్ చేయగా నాగచైతన్య హీరోగా నటించారు. మాతృకలో నటించిన అనుపమ పరమేశ్వరన్‌, మడోన్నా సెబాస్టియన్ రీమేక్‌లోనూ నటించగా సాయిపల్లవి పాత్రను శ్రుతిహాసన్ చేసింది. ఇక ఈ చిత్ర స‌క్సెస్‌తో అనుపమ, సాయిపల్లవి ఓవ‌ర్‌నైట్‌లో స్టార్స్‌గా మారారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్​ను సంపాదించుకున్నారు. వీరిద్దరు ప్రస్తుతం టాలీవుడ్​లో టాప్ హీరోయిన్లుగా కూడా రాణిస్తున్నారు. పలు చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

93 రోజుల్లో 'పుష్ప- 2'- బాక్సాఫీస్​ పోటీలో ఆ స్టార్ హీరోలు- ఎవరూ 'తగ్గేదేలే'!

1980 బ్యాక్ ​డ్రాప్​లో OTTలోకి సూపర్​ హిట్​ రివెంజ్ డ్రామా - ఎందులో చూడాలంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.