Sai Pallavi About Shyam Singha Roy: తన నేచురల్ లుక్‌తో, అద్భుతమైన యాక్టింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది స్టార్ హీరోయిన్ బ్యూటీ సాయి పల్లవి. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ కథానాయిక తాజాగా 'అమరన్'తో మాసివ్ సక్సెస్ అందుకుంది. ఇందులో ఆమె యాక్టింగ్‌కు బాగా కనెక్ట్ అయిన ఆడియెన్స్ థియేటర్లలోనే కంటతడి పెట్టారట. అంతలా ఆమె ఆ పాత్రలో ఒదిగిపోయి మెప్పించింది. ఇక ఈ మూవీ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న సాయి పల్లవి తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమా కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా 'శ్యామ్ సింగరాయ్' షూటింగ్ సమయంలో కన్నీటి పర్యంతమైనట్లు చెప్పుకొచ్చింది. ఇంతకీ ఏమైందంటే?
"శ్యామ్ సింగరాయ్ చిత్రీకరణ సమయంలో ఆ రోజు షూట్ పూర్తయితే నేను ఎంతో ఆనందపడేదాన్ని. ఆ సినిమాలో నేను ఉన్న సీన్స్ అన్నీ చాలా వరకూ రాత్రి పూటే షూట్ చేశారు. అయితే రాత్రి షూటింగ్‌లు నాకు అస్సలు అలవాటు లేదు. అంతేకాకుండా నాకు పగలు నిద్ర రాదు. దీంతో రాత్రిళ్లు నాకు చాలా కష్టంగా అనిపించేది. తెల్లవారు వరకూ మేల్కొని ఉండాల్సి వచ్చేది. ఇలా ఒకట్రెండు రోజులు కాదు దాదాపు 30 రోజుల నా పరిస్థితి ఇదే. అయితే ఓ వైపు 'శ్యామ్ సింగరాయ్' మరోవైపు అప్పటికే ఒప్పుకున్న మిగతా సినిమాల షూటింగ్స్ ఇలా నా షెడ్యూల్ చాలా టైట్‌గా ఉండేది. దీంతా వాటికి కూడా వెళ్లాల్సి వచ్చేది. ఒక రోజు రాత్రి నన్ను చూడటానికి నా చెల్లి వచ్చింది. అప్పుడు నేను తనతో మాట్లాడుతున్న సమయంలో ఉన్నట్టుండి ఏడ్చేశాను. ఒప్పుకొన్న సినిమాలన్ని చేయాలని ఉంది. కానీ, ఒక రోజైనా రెస్ట్ దొరికితే బాగుంటుంది" అంటూ నా బాధను తనతో చెప్పుకొన్నా. అప్పటివరకూ నేను ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పుకోలేదు. దీంతో నా చెల్లెలు నేరుగా 'శ్యామ్ సింగరాయ్' ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్లి 'మా అక్క ఏడుస్తోంది. ఒక రోజైనా లీవ్ ఇవ్వండి' అని అడిగింది. దీంతో నిర్మాత వెంకట్ వెంటనే రెస్పాండ్ అయ్యి 'పదిరోజులు లీవ్ తీసుకో. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అవన్నీ చేసి, అంతా బాగానే ఉందనుకున్నాక తిరిగి షూటింగ్‌కు రావచ్చు' అని అన్నారు" అని అప్పటి రోజులను గుర్తు చేసుకుని సాయి పల్లవి ఎమోషనల్ అయ్యారు.
ఇక 'శ్యామ్ సింగరాయ్'లోనూ సాయి పల్లవి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో ఆమె చేసిన రోసీ పాత్రకు అభిమానులు ఫిజా అయిపోయారు. ముఖ్యంగా తన డ్యాన్స్‌తో సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇక ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ కూడా అందుకుంది.
ధనుశ్ సపోర్ట్ లేకుంటే ఆ సినిమాకు నో చెప్పేదాన్ని : సాయి పల్లవి