Rs 477 Crore For One Dialogue : సినిమాల్లో ఎంతో మంది స్టార్స్ తమ పాత్రల్లో లీనమై నటించి ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుంతుంటారు. తమ యాక్టింగ్‌కు గానూ ఆయా స్థార్స్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ కూడా అందుకుంటారు. డైలాగ్స్ ఎన్నైనా, పాత్ర నిడివి ఎంతైనా మార్కెట్లో తమ ఇమేజ్‌కు తగ్గట్లుగా పారితోషకాన్ని ఛార్జ్ చేస్తుంటారు. అయితే ఓ స్టార్ హీరో ఒక్క డైలాగ్‌కు రూ.447 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అందులో ఆయన చెప్పేది ఒకే డైలాగ్ అయినప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో ఛార్జ్ చేసి రికార్డుకెక్కారు. ఇంతకీ ఆ స్టార్ ఎవరని అనుకుంటున్నారా ? ఆయనెవరో కాదు హాలీవుడ్ హీరో విన్ డీజిల్.
'XXX', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్', 'ఫాస్ట్ ఫైవ్' సినిమాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందారు విన్ డీజిల్. తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ స్టార్ హీరో ఇప్పటివరకు డిఫరెంట్ షెడ్స్ ఉన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అలా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లోని 'గ్రూట్' అనే యానిమేషన్ పాత్రకు డబ్బింగ్ చెప్పారు.
అయితే గ్రూట్ పాత్రకు సినిమా మొత్తం ఒకే ఒక డైలాగ్ ఉంటుంది అదే 'ఐ యామ్ గ్రూట్'. ఇక ఈ ఒక డైలాగ్ తోనే ప్రతి సినిమాలో ఈ పాత్ర కనిపిస్తుంటుంది. అయితే ఈ యానిమేటెడ్ క్యారెక్టర్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చినందుకుగానూ డీజిల్ రూ. 447 కోట్లు తీసుకున్నారు. అయితే తన వాయిస్ మాడ్యూలేషన్‌తో ఆ ఒక్క డైలాగ్‌ను ఆయన వివిధ రకాలుగా చెప్పి ఆకట్టుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
మరోవైపు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో గ్రూట్ క్యారెక్టర్ 8 సినిమాల్లో కనిపిస్తుంది.
'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ' (2014)
'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 2' (2017)
'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్' (2018)
'అవెంజర్స్: ఎండ్ గేమ్' (2019)
'థోర్: లవ్ అండ్ థండర్' (2022)
'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ: హాలిడే స్పెషల్ '(2022, ఓటీటీలో రిలీజ్)
'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3' (2023)
'ఐ యామ్ గ్రూట్ సీజన్ 1 అండ్ 2 (2022-2023)'.
అయితే ఈ సినిమాలన్నింటిలో 'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ' సీజన్ 1 అండ్ 2 నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యాయి. దీనిలో 'గ్రూట్' పాత్ర ఒక్కటి మాత్రమే ఉంది. కానీ డైలాగ్స్ ఉండవు. మిగతా వాటిలో హీరోలతో పాటు 'గ్రూట్' క్యారెక్టర్ ఉంటుంది.
ఈ టీవీ ఆర్టిస్ట్ ఓ మిలియనీర్- బాలీవుడ్ హీరోల హీరోలనే మించిపోయాడుగా!
రూ. 51 రెమ్యూనరేషన్ - ఆ సినిమా విషయంలో తొలిసారి పేరు మార్చుకున్న ధర్మేంద్ర