ETV Bharat / entertainment

RRR సీక్వెల్​పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్​! - Rajamouli RRR Sequel

RRR Sequel : ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా సీక్వెల్ కోసం అందరూ ఎంత ఆత్రుతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వారి ఎదురుచూపులకు షాకింగ్ న్యూస్ చెప్పారు ఆ సినిమా దర్శకుడు రాజమౌళి.

ఆర్ఆర్ఆర్ సీక్వెల్​పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 6:37 AM IST

RRR Sequel Rajamouli : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'ఆర్​ఆర్​ఆర్​' సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరును తెచ్చిపెట్టింది. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ విజయకేతనం ఎగరేసి, రికార్డు స్థాయి వసూళ్లను సాధించింది. ఇప్పటికీ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఓ చోట స్క్రీనింగ్ అవుతూనే ఉంది. రీసెంట్​గా కూడా మార్చి 18న జపాన్​లో జరిగిన 'ఆర్ఆర్ఆర్' స్పెషల్ స్క్రీనింగ్ షోకు సినిమా దర్శకుడు రాజమౌళి గెస్ట్​గా హాజరైన సంగతి తెలిసిందే. విజవల్ వండర్ గా తెరకెక్కిన ఈ 'ఆర్ఆర్ఆర్' సినిమా అక్కడి వారికి కూడా తెగ నచ్చేసింది. ఊహించని రీతిలో రెస్పాన్స్ రావడంతో పాటు అక్కడి అభిమానులు రాజమౌళిపై పొగడ్తల వర్షం కురిపించారు.

అయితే తాాజాగా 'ఆర్​ఆర్​ఆర్​' సీక్వెల్​కు సంబంధించిన ప్రశ్నలు దర్శకుడు జక్కన్నకు మరోసారి ఎదురయ్యాయి. దీనికి ఆయన సమాధానం చెప్పిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. అందులో ఆయన నోటి వెంట 'ఆర్ఆర్ఆర్-2' అనే మాట రావడమే ఆలస్యం అక్కడి వారంతా కేకలు వేస్తూ చప్పట్లు కొడుతూ గోల గోల చేశారు. వారి అభిమానానకి ఎంతో ఆనందించిన దర్శకధీరుడు "నాకు సినిమా గురించి చాలా ఆలోచనలు ఉన్నాయి. కానీ వాటిని ప్రస్తుతం మీతో చెప్పలేను" అని చెప్పారు.

RRR Movie NTR Ramcharan : కాగా, పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ఆర్​ఆర్​ఆర్​ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్​గా తారక్‌ కనిపించారు. వీరి నటనకు గ్లోబల్​ వైడ్​గా ఉన్న సినీ లవర్స్​, సినీ సెలబ్రిటీలు ఫిదా అయిపోయారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్​పై దానయ్య నిర్మించారు. ఈ సినిమాకు కీరవాణి స్వరాలు అందించారు. ఆయన అందించిన సంగీతానికి గానూ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. బాలీవుడ్ బ్యూటీ అలియాభట్‌, హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరీస్‌ కథానాయికలుగా నటించారు. సీనియర్ నటులు శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

SSMB 29 కోసం రాజమౌళి షాకింగ్ రెమ్యునరేషన్​!

దటీజ్​ రాజమౌళి - ఒక్క నిమిషంలోనే హౌస్‌ఫుల్‌ అయిన జక్కన్న సినిమా తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.