ETV Bharat / entertainment

కాంట్రవర్సీ కామెంట్స్​పై రిషభ్​ శెట్టి క్లారిటీ - ఏం చెప్పారంటే? - Rishab Shetty Bollywood Comments - RISHAB SHETTY BOLLYWOOD COMMENTS

Rishab Shetty Clarifies Controversy comments On Bollywood : బాలీవుడ్‌ను ఉద్దేశించి కన్నడ హీరో రిషభ్​ శెట్టి ఆ మధ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు కామెంట్స్​ బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ విషయమై రిషభ్​ క్లారిటీ ఇచ్చారు.

source ANI
Rishab Shetty (source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2024, 10:47 AM IST

Rishab Shetty Clarifies Controversy comments On Bollywood : 'కాంతార'తో ఒక్క సారిగా దేశ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చి పుల్​ క్రేజ్​ సంపాదించుకున్నారు రిషభ్​ శెట్టి. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను అందుకుని బ్లాక్ బస్టర్ హిట్​గా నిలిచింది. అయితే రీసెంట్​గా ఆయన బాలీవుడ్​ను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్​గా మారి చర్చనీయాంశమయ్యాయి. బాలీవుడ్‌ మన దేశాన్ని తక్కువ చేసి చూపించిందంటూ రిషభ్​ చెప్పినట్లు వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. తాజాగా ఈ కామెంట్స్​పై రిషభ్​ శెట్టి స్పందించారు. తన కామెంట్స్​ను ట్విస్ట్ చేశారని చెప్పారు శెట్టి. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు.

తాజాగా ఐఫా(IIFA Utsavam 2024) వేడుకల్లో పాల్గొన్న రిషభ్​ను పలువురు విలేకర్లు ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాలని అడిగారు. అందుకు రిషభ్​ స్పందించారు. "నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. అసలు నా కామెంట్స్​ను ట్విస్ట్‌ చేశారు. అసలు నా ఉద్దేశం వేరు. కచ్చితంగా ఈ విషయంపై నేను స్పష్టత ఇస్తాను. ఆ సమయంలో దీని గురించి పూర్తిగా మాట్లాడుదాం." అని అన్నారు.

కాగా, అబుదాబి వేదికగా జరిగిన ఐఫా వేడుకల్లో ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్‌ ఇన్‌ కన్నడ సినిమా పురస్కారాన్ని దక్కించుకున్నారు రిషభ్​. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై అభిమానం చూపించిన ఫ్యాన్స్​కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు మరెన్నో అద్భుత సినిమాలను తెరకెక్కిస్తానని చెప్పారు.

Rishab Shetty Kantar Prequel : ఇక రిషభ్ శెట్టి సినిమాల విషయానికొస్తే - ఆయన ప్రస్తుతం 'కాంతార'కు ప్రీక్వెల్‌గా 'కాంతార: చాప్టర్‌ 1' సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఓ పోస్టర్​ను కూడా విడుదల చేశారు. కదంబుల కాలంలో సాగే ఆసక్తికర కథాంశంతో ఈ తొలి భాగం తెరకెక్కిస్తున్నారు. దీని కోసం రిషభ్​ గత కొద్ది కాలంగా కలరియపట్టు యుద్ధ విద్యలో కఠిన శిక్షణ తీసుకుంటున్నారు.

బాలీవుడ్‌పై రిషబ్‌ శెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు - ఏం అన్నారంటే? - Rishabh Shetty Controversy Comments

'దేవర' ఓపెనింగ్స్​ - కళ్లు చెదిరే వసూళ్లు! - ఏకంగా ఎన్ని కోట్లంటే? - Devara First Day Collections

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.