Richa chadha Heeramandi : పాత్ర కోసం నటీనటులు ఏదైనా చేసేందుకు సిద్ధమవుతుంటారు. ప్రేక్షకుల్ని అలరించడమే లక్ష్యంగా ఎంతటి కష్టానైనా భరిస్తుంటారు. సన్నివేశం సహజంగా ఉండేందుకు ఎలాంటి సాహసమైనా చేస్తుంటారు. తాజాగా హీరోయిన్ రిచా చద్దా కూడా అలానే చేసింది. మద్యం తాగి డ్యాన్స్ వేసే సన్నివేశం కోసం నిజంగానే ఆమె మందు తాగి చిందులేసింది. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది.
రీసెంట్గా ఈ ముద్దుగుమ్మ నటించిన హీరామండి వెబ్ సిరీస్ సినీప్రియుల ప్రశంసలను దక్కించుకుంటోంది. ఈ సిరీస్‌లో మనీషా కొయిరాలా, అదితిరావు హైదరీ, సోనాక్షి సిన్హాలతో పాటు బాలీవుడ్ భామ రిచా చద్దా కూడా కీలక పాత్ర పోషించింది. అయితే వెబ్‌సిరీస్ ప్రశంసలు అందుకుంటున్న నేపథ్యంలో ఈ సిరీస్ షూటింగ్ అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది రిచా.
"దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రతీ సీన్‌ను ఎంతో శ్రద్ధగా తెరకెక్కిస్తారు. ఓ సీన్లో అయితే నేను మద్యం తాగి డ్యాన్స్ చేయాలి. ఒక రోజంతా దీనిపై చిత్రీకరణ చేశాం. కనీసం పావు వంతు కూడా అస్సలు అవలేదు. దాదాపు 40 టేక్‌లు తీశారు. కానీ అనుకున్నట్టుగా రావడం లేదని చెప్పారు. దీంతో రెండో రోజు నిజంగానే నేను మందు తాగాను. అంతే డ్యాన్స్ అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చింది. మనల్ని నమ్మి ఇచ్చిన పాత్రకు 100కి 100 శాతం న్యాయం చేయాలనేదే నా స్వభావం. మనకంటూ ఒక గుర్తింపు రావాలి. మనం ఎలా ఉన్నాం, మన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది అనీ ఎవరూ పట్టించుకోరు. ఒకవేళ పట్టించుకున్నా కాసేపే చూస్తారు. చివరిగా మన నటనను మాత్రమే చూసి గుర్తుపెట్టుకుంటారు. ఈ సిరీస్‌లో నేను మంచి పాత్ర పోషించాను. అందుకే సెట్‌లో ప్రతిఒక్కరి సూచనలు తీసుకుని నటించాను. నాకెంతో బాగా నచ్చింది" అని చెప్పుకొచ్చింది.
ఇటీవలే ఈ వెబ్ సిరీస్‌పై స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ప్రశంసలు కురిపించారు. గతంలో ఈమె సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రెండు చిత్రాల్లో నటించారు. ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ "మీరు(సంజయ్ లీలా భన్సాలీ ఈ సిరీస్‌ను తెరకెక్కించేందుకు ఎంత కష్టపడి ఉంటారో నాకు బాగా తెలుసు. సిరీస్ అద్భుతంగా ఉంది" అని పొగిడారు. ఇందులో నటించిన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలిపారు.
'నాకు కాబోయే వాడు అలా ఉండాలి' - Kritisanon Relationship
హిందీ తెరపై తెలుగోడి బయోపిక్ - సూపర్ రెస్పాన్స్! - Rajkummar Rao Srikanth Movie