RC 15 Gamechanger Heroine Kiara Advanis sister : బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ తన క్యూట్ లుక్స్‌తో కుర్రాళ్లకు డ్రీమ్ గర్ల్ గా మారింది. 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ అమ్మడు ఇప్పుడు 'గేమ్ ఛేంజర్'తో మరోసారి టాలీవుడ్లో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. గతేడాదే ఈ అమ్మడు బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కియారా వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ అంతగా తెలియకపోవచ్చు. ఈ క్రమంలో కియారా సోదరి ఇషితా అడ్వాణీ గురించి తెలిసింది. ఆమె కూడా ఎంతో క్యూట్‌గా ఉన్నారు. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
సింపుల్‌గా ఉండటం ఇష్టం - కియారా అడ్వాణీ కన్నా ఆమె సోదరి ఇషితా అద్వాణీ మూడేళ్లు పెద్ద. ఇషిత 1989 నవంబరు 20వ తేదీన జన్మించారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా సోదరి, హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు వదిన అయినప్పటికీ ఇషిత ఎప్పుడూ సినీ ఈవెంట్లలో పాల్గొనలేదు. అలాగే సెలబ్రెటీ లైఫ్ స్టైల్‌ను ఆమె ఎక్కువగా పాటించరు. సాదాసీదా జీవితాన్ని గడపడానికే ఇష్టపడతారట. అలాగే సోషల్ మీడియాను కూడా తక్కువగా వాడుతుంటారని తెలిసింది. అప్పుడప్పుడు తన తోబుట్టువు కియారా అడ్వాణీ , సోదరులు ఇషాన్ అడ్వాణీ, మిషాల్ అడ్వాణీ ఫొటోలను పంచుకుంటారు. ట్రావెలింగ్ అంటే ఇష్టమట. ఖాళీ దొరికినప్పుడు వెకేషన్లకు వెళ్తుంటారు.
భర్త కూడా లాయరే - ఇషిత ముంబయిలోని ప్రభుత్వ లా కాలేజీలో న్యాయ విద్యను పూర్తి చేశారు. వృత్తిరీత్యా ఆమె న్యాయవాదిగా కొనసాగుతున్నారు. ఇషితా అడ్వాణీ తన ప్రియుడు కర్మ వివాన్ను 2022 మార్చి 5న పెళ్లాడారు. ఆయన కూడా న్యాయవాదే. ఇకపోతే కియారా, ఇషా తమ్ముడు మిషాల్ అడ్వాణీ పాట రచయిత, అలాగే నిర్మాతగానూ రాణిస్తున్నారు.
ఇక కియారా అడ్వాణీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె ఆర్సీ 15 గేమ్‌ఛేంజర్‌లో నటించింది. త్వరలోనే ఇది రిలీజ్ కానుంది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌తో కలిసి 'లస్ట్ స్టోరీస్', 'గోవిందా నామ్ మేరా' సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక షేర్ షా సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించిన ఈమె ఆ తర్వాత అతడినే పెళ్లి చేసుకుంది.
బాలీవుడ్ 'రామాయణ'లో విశ్వంభర విలన్! - Vishwambara Villain Ramayana