ETV Bharat / entertainment

రవితేజ ట్రిపుల్ ధమాకా - ఫ్యాన్స్ కోసం మూడు గుడ్ న్యూస్​లు రెడీ! - raviteja eagle movie response

Raviteja Eagle Movie : మాస్ మహారాజా రవితేజ తన అభిమానులకు ట్రిపుల్ ధమాకా ఇవ్వనున్నారు. ఆయనకు సంబంధించి ఏకంగా మూడు గుడ్​ న్యూస్​లు వచ్చాయి. ఆ వివరాలు.

రవితేజ త్రిపుల్ ధమాకా - ఫ్యాన్స్ కోసం మూడు గుడ్ న్యూస్​లు రెడీ!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 11:16 AM IST

Updated : Feb 27, 2024, 11:42 AM IST

Raviteja Eagle Movie : మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఈగల్ మూవీ సక్సెస్​తో ఫుల్ హ్యాపీ మోడ్​లో ఉన్నారు. వాల్తేరు వీరయ్యతో హిట్​ అందుకున్న ఆయన ఆ తర్వాత వరుస ఫ్లాప్​లను అందుకున్నారు. మళ్లీ ఇంతకాలానికి సక్సెస్​ను ఖాతాలో వేసుకున్నారు. దీంతో ఆయన అభిమానులు కూడా ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పుడాయన హరీశ్​ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నారు. షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలోనే రవితేజకు సంబంధించిన మూడు క్రేజీ వార్తలు మాస్ మాహారాజా అభిమానులను ఊపేస్తున్నాయి.

ట్రిపుల్ ధమాకా - రవితేజ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒక సినిమా రిలీజ్ అయ్యేలోపు మరో రెండు చిత్రాలను సెట్స్​పైకి తీసుకెళ్తున్నారు. అయితే గత ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో హిట్ అందుకున్న ఆయన ఆ తర్వాత వరుస పరాజయాలను అందుకున్నారు. రావణాసురతో ఫ్లాప్​ అందుకున్న ఆయన ఆ తర్వాత దసరాకు భారీ అంచాలతో టైగర్ నాగేశ్వరరావుతో వచ్చి అభిమానులను నిరాశ పరిచారు. దీంతో ఫ్యాన్స్​ కూడా బాధపడ్డారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ ఏడాది ఈగల్(Raviteja Eagle Movie) సినిమాతో బోణి కొట్టేశారు. ఈ చిత్రం మాస్ మాహారాాజా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. రవితేజ యాక్టింగ్‌, టెక్నికల్‌గా సినిమాను చూపించిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

అయితే మాస్ మాహారాజా రవితేజ కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అందులో కిక్ చిత్రం కూడా ఒకటి. ఇది రవితేజ కెరీర్​లోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని మార్చి 1న గ్రాండ్​గా రీ రిలీజ్(Kick Movie Rerelease) చేయబోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో కిక్ రీ రిలీజ్ హ్యాష్ ట్యాగ్ తెగ ట్రెండ్ అవుతోంది. అలాగే రవితేజ రీసెంట్ రిలీజ్​ ఈగల్ కూడా ఫ్యాన్స్​కు సూపర్​ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ చిత్రం మార్చి 2 నుంచి ఈటీవీ విన్‌‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవ్వనుంది. దీంతో వరుసగా రెండు రోజుల పాటు రవితేజ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్కే కిక్కు అంటూ నెటిజన్లు, అభిమానులు తెగ పోస్టులు పెడుతున్నారు.

మరో విషయమేంటంటే 'ధమాకా' చిత్రంలోని పల్సర్ బైక్ వీడియో సాంగ్ కూడా ఓ సూపర్ రికార్డ్ సాధించింది. రీసెంట్​గా ఈ పాట 200 మిలియన్ వ్యూస్‌‌ను దాటింది. దీంతో మాస్ మహారాజా ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తెలుగమ్మాయి అంజలి హైడోస్ గ్లామర్ షో - ఏంటి ఇంత పెద్ద షాక్ ఇచ్చింది!

బాలీవుడ్ కోడలైన బాలయ్య భామ - పెళ్లి కొడుకు ఎంట్రీ వైరల్​!

Last Updated : Feb 27, 2024, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.