Raveena Tandon Rejected Sharukh Khan Movie : బాలీవుడ్ హిట్ పెయిర్స్‌లో షారుక్ ఖాన్, రవీనా టాండన్ జోడీకి ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ జంట 'యే లమ్హే జుదాయి కే', 'జాదు', 'జమానా దివానా' వంటి హిట్ చిత్రాలతో నటించి ప్రేక్షకులను అలరించింది. అయితే ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమా చేయాల్సి ఉండగా, అప్పుడు ఆ చిత్రాన్ని రవీనా రిజక్ట్ చేశారట. ఆమె అలా ఎందుకు చేశారన్న విషయం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. అయితే ఆ చిత్రం మరేదో కాదు 'డర్'. షారుక్, జూహీ చావ్లా నటించిన ఈ చిత్రం ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
"షారుక్ ఖాన్ లీడ్ రోల్లో కనిపించిన ఓ సినిమాకు ఫస్ట్ నన్నే హీరోయిన్గా ఎంచుకున్నారు. స్టోరీ అలాగే అందులోని నా పాత్ర నాకెంతో నచ్చాయి. కానీ సినిమాకు సైన్ చేసే సమయంలో కాస్ట్యూమ్స్ గురించి మూవీ టీమ్ నాతో చర్చించింది. వాళ్లు నేను ధరించాల్సిన దుస్తుల గురించి చెప్పినప్పుడు నేనెంతో షాకయ్యాను. వాళ్లు చెప్తున్నప్పుడు నాకు ఎంతో ఇబ్బందిగా అనిపించింది. అది చిన్న విషయమే అయినప్పటికీ నేను ఆ ప్రాజెక్ట్‌కు నో చెప్పాను. ఆ దుస్తులను వేసుకుని యాక్ట్ చేయలేనని చెప్పాను. షారుక్ కూడా ఈ విషయం తెలుసుకుని షాకయ్యారు. 'నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? సినిమాకు నో చెప్పాల్సిన అవసరం ఏముంది?. మనం ఇంకెన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలి కదా అని షారుక్ అన్నారు. కాస్ట్యూమ్స్ వల్లనే నేను చేయలేకపోతున్నానంటూ ఆయనకు చెప్పా. అది విన్న తర్వాత ఆయన నన్ను బాగా అర్థం చేసుకున్నారు" అంటూ రవీనా ఆ విషయాన్ని ఇప్పుడు రివీల్ చేశారు.
'పత్తర్ కే ఫూల్' సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు రవీనా టాండన్. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పలు హిట్ సిినిమల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. 2022లో విడుదలైన 'కేజీయఫ్ 2' చిత్రంలో రమికాసేన్‌గా కనిపించి మెప్పించారు. ప్రస్తుతం ఆమె 'వెల్‌కమ్ టు ది జంగీల్'లో యాక్ట్ చేస్తున్నారు.
ట్విట్టర్లో ఫేక్ వీడియో - నెటిజన్‌పై నటి రూ.100 కోట్ల దావా - Raveena Tandon Defamation Case