ETV Bharat / entertainment

రామాయణ సెట్స్​లోకి రణ్​బీర్, సాయిపల్లవి- ఔట్​పుట్ ఫుల్​ నేచురల్​! - Ranbir Kapoor Sai Pallavi Ramayana - RANBIR KAPOOR SAI PALLAVI RAMAYANA

Ranbir Kapoor Sai Pallavi Ramayana: నితీశ్​ తివారి దర్శకత్వంలో తెరకెక్కనున్న రామాయణ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభమైందట. ఈ సినిమాలో రణ్​బీర్, సాయిపల్లవి లుక్స్​ చాలా నేచురల్​గా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

Ranbir Kapoor Sai Pallavi Ramayana
Ranbir Kapoor Sai Pallavi Ramayana
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 15, 2024, 8:15 PM IST

Ranbir Kapoor Sai Pallavi Ramayana: నితీశ్​ తివారి దర్శకత్వంలో రామాయణ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ మూవీ గురించి ఎన్నో క్రేజీ అప్డేట్స్ తరుచుగా వినిపిస్తునే ఉన్నాయి. శ్రీ రాముడిగా రణ్​బీర్, సీతమ్మగా సాయి పల్లవి అనే వార్త ప్రచారంలోకి రాగానే సినిమాకు పాన్ ఇండియా రేంజ్​లో బజ్ క్రియేట్ అయ్యింది. వీరితోపాటు కేజీఎఫ్ స్టార్ యశ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కి షూటింగ్ కూడా ప్రారంభమైందంటూ ఓ ఫ్యాన్ పేజీ తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. క్రౌన్ కపూర్ అనే పేరుతో ఉన్న ఫ్యాన్ పేజీ ఈ విషయాన్ని పోస్ట్​ చేసింది. షూటింగ్​లో రణ్​బీర్ కపూర్ చాలా సహజంగా ఉన్నాడని, ఇక సాయిపల్లవి కూడా కొన్ని నెలల క్రితం ఓ అభిమాని క్రియేట్ చేసిన AI వెర్షన్ సీతలాగానే ఉందని పోస్ట్​లో రాసి ఉంది. లక్ష్మణుడిగా రవి దుబే కూడా ఆ పాత్రలో ఒదిగిపోయాడంటున్నారు. ఇమేజ్ టెక్స్ట్ ను షేర్ చేశాక, ఒక జూనియర్ ఆర్టిస్ట్ రామాయణ షూటింగ్ కొద్దిరోజుల క్రితం ప్రారంభమైనట్లు సమాచారం ఇచ్చారని క్యాప్షన్ కూడా పెట్టింది. కానీ, ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.

ఈ సినిమాలో కేజీఎఫ్ స్టార్ యశ్ కీలక పాత్ర పోషించడంతో పాటు కో ప్రొడ్యూసర్​గా కూడా వ్యవహరించనున్నారట. నమిత్ మల్హోత్రా కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్​తో యశ్ స్థాపించిన కంపెనీ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. నమిత్ మల్హోత్రా DNEGకు గ్లోబల్ సీఈవో కూడా. ఈ సినిమాను నిర్మించాలని చాలాకాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నం ఇప్పటికీ నితీశ్​ తివారి ద్వారా నెరవేరబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి రణ్​బీర్ కపూర్ అత్యధికంగా రూ.250 కోట్లు రెమ్యునరేషన్, సాయిపల్లవి రూ.20కోట్లు తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

రామాయణం మొదలు - యశ్, రణ్​బీర్ సెట్​లోకి జాయిన్​ అయ్యేది అప్పుడే! - Ramayana Movie

రణ్​బీర్, సాయి పల్లవి రెమ్యూనరేషన్- రామాయణ్​కు ఎంత ఛార్జ్ చేస్తున్నారో తెలుసా? - Ramayana Ranbir Kapoor

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.