ETV Bharat / entertainment

ఎర్ర కండువా, స్వాగ్ లుక్​ - గేమ్​ ఛేంజర్​ అప్​డేట్​తో చెర్రీ వచ్చేశారబ్బా! - Ram Charan Game Changer Movie

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 7, 2024, 5:06 PM IST

Ram Charan Game Changer Update : గ్లోబల్ స్టార్ రామ్​చరణ్​ అప్​కమింగ్ మూవీ 'గేమ్​ ఛేంజర్​' నుంచి తాజాగా ఓ స్పెషల్ అప్​డేట్​ను విడుదల చేశారు మేకర్స్​. ఆ విశేషాలు మీ కోసం

Ram Charan Game Changer Update
Ram Charan (ETV Bharat)

Ram Charan Game Changer Movie : గ్లోబల్ స్టార్ రామ్​చరణ్​ అప్​కమింగ్ మూవీ 'గేమ్​ ఛేంజర్​' నుంచి తాజాగా ఓ స్పెషల్ అప్​డేట్​ను విడుదల చేశారు మేకర్స్​. వినాయక చవితి విషెస్​ చెప్తూనే చెర్రీకి సంబంధించిన కొత్త స్టిల్​ను రివీల్ చేసి అబ్బురపరిచారు. అంతేకాకుండా సెకెండ్ సింగిల్​ను ఎప్పుడు అనౌన్స్​ చేయనున్నారో చెప్పారు.

ఇక ఆ పోస్టర్​లో చెర్రీ తలకు ఓ ఎర్ర కండువా కట్టుకుని కనిపించారు. ఇది చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. 'గబ్బర్ సింగ్​'లో పవన్ కల్యాణ్ స్టిల్​తో పోలుస్తూ సంబరపడిపోతున్నారు. బాబాయ్ పవన్ లుక్​లో అబ్బాయి అదిరిపోయాడంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరోవైపు ఇదే అప్​డేట్​లో ఈ సినిమా సెకెండ్ సింగిల్ ఎప్పుడు రానుందో చెప్పేశారు. డేట్ రివీల్ చేయనప్పటికీ, ఈ సెప్టెంబర్​లోనే రానుందంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో త్వరలోనే ఇంకో అనౌన్స్​మెంట్ రానుందంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

Game Changer Release Date: మరోవైపు ఈ సినిమా రిలీజ్ గురించి కూడా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిర్మాత దిల్​రాజు ఇదివరకే చెప్పినట్లుగా కచ్చితంగా క్రిస్మస్ సందర్భంగానే ఉంటుందని మరో వార్త చక్కర్లు కొడుతుంది. అంటే 2024 డిసెంబర్ 20వ తేదీని లాక్ చేసి పెట్టారట ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇక సెప్టెంబర్ చివరి వారంలో టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. మరోవైపు సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఒకటైనా దసరాకు రిలీజ్ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.​

వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టక ముందే శంకర్ 'భారతీయుడు 2' సగం పూర్తి చేశారు. 'గేమ్ ఛేంజర్' మొదలైన కొద్ది నెలలకు మిగిలిన సినిమా కంప్లీట్ చేసేందుకు బ్రేక్ తీసుకున్నారు. అలా 'గేమ్ ఛేంజర్‌'కు బ్రేక్ పడింది. ఆ తర్వాత కొన్ని ప్రత్యేక కారణాల రీత్యా సినిమా పూర్తి కావడానికి కాస్త ఆలస్యం అయింది. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యుయెల్ రోల్​లో కనిపించనున్నారని సమాచారం. ఇక చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ నటిస్తోంది. సీనియర్ డైరెక్టర్, నటుడు ఎస్​జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమా రూపొందుతుంది.

'గేమ్​ఛేంజర్​లో సూర్య పాత్రకు థియేటర్లలో పేపర్లు పడతాయి' - Game Changer

'గేమ్ ఛేంజర్'లో అంజలి పాత్ర తెలిసిపోయింది- శంకర్ ప్లాన్ అదుర్స్​! - Anjali Game Changer

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.