Game Changer Counte Down : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్- ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న 'గేమ్ ఛేంజర్' సినిమాపై రోజు రోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా 2025 సంక్రాంతి సందర్భంగా థియేటర్లకు రానుంది. ఈ క్రమంలో మూవీ టీమ్ రిలీజ్ 'కౌంట్ డౌన్' పోస్టర్ విడుదల చేసింది. సినిమా మరో 75 రోజుల్లో రిలీజ్ కానున్నట్లు పేర్కొంది.
ఈ నేపథ్యంలోనే టీజర్ గురించి కూడా అప్డేట్ ఇచ్చింది. 'ఈ శక్తి ప్రపంచ వ్యాప్తంగా 75 రోజుల్లో పేలనుంది. టీజర్ త్వరలోనే రానుంది. 10.01.2025న మూవీ రిలీజ్ కానుంది' అని పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ లెక్కన ఈ దీపావళికి టీజర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టీజర్ కోసం ఫ్యాన్స్ కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
పోస్టర్లో హీరో రామ్‌చరణ్‌ను వెనకాల నుంచి చూపించారు. ఆయన సూటు ధరించి ఇంటి ఆరుబయట వేసిన ఓ కుర్చీలో కూర్చొని ఉన్నారు. అటుగా మెయిన్ గేట్ నుంచి వందల మంది ఆయుధాలతో ఆయన వైపునకు దూసుకువస్తున్నారు. చెర్రీ ముందు ఓ టేబుల్ ఉంది. దానిపై ఓ ల్యాండ్ ఫోన్, పుస్తకం ఉన్నాయి. ఎడమవైపున వాకీటాకీ కూడా ఉంది. మొత్తానికి పోస్టర్ కూడా చాలా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి రెండు పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
Unleashing the explosive power worldwide in 75 Days ❤️🔥
— Game Changer (@GameChangerOffl) October 27, 2024
The #GameChangerTeaser fireworks to begin soon 🧨💥#GameChanger In Cinemas near you from 10.01.2025! pic.twitter.com/b5bhC0BezZ
ఇక సినిమా విషయానికొస్తే, సీనియర్ డైరెక్టర్ శంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్‌చరణ్ డ్యుయెల్ రోల్లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ హీరోయిన్గా నటించింది. సీనియర్ నటులు యస్ జే సూర్య, అంజలీ, శ్రీకాంత్ తదితరులు ఆయా పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందించారు. శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నిర్మించారు. ఈ సినిమా 2025 సంక్రాంతి బరిలో దిగనుంది.