ETV Bharat / entertainment

శూర్పణఖగా రకుల్​ - పెళ్లి తర్వాత తొలి సినిమా ఇదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 4:45 PM IST

Updated : Feb 10, 2024, 6:53 PM IST

Rakul Preet Singh Ramayan : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్​ తివారీ తెరకెక్కించనున్న 'రామాయణం'లో బీటౌన్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా కనిపించనుందట. ఆ విశేషాలు మీ కోసం

Rakul Preet Singh Ramayan
Rakul Preet Singh Ramayan

Rakul Preet Singh Ramayan : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీశ్​ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న లేటెస్ట్​ మూవీ 'రామాయణం'. ఎంతో కాలంగా ఆయన తన డ్రీమ్​ ప్రాజెక్ట్​పై వర్క్​ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్​ పనులు ముగించుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఎవరెవరు ఏయే పాత్రల్లో కనిపించనున్నారన్న విషయం గురించి అందరిలో ఆసక్తి నెలకొంది. ఇందులో ఇప్పటికే రణ్​బీర్ కపూర్, సాయి పల్లవి రోల్స్​ ఫిక్స్​ అయిపోయాయని సమాచారం. ఈ ఇద్దరూ సీతా రాములుగా కనిపించనున్నారట. ఇక వీరితో పాటు ఈ సినిమాలో రావణుడిగా కన్నడ స్టార్ హీరో రాకింగ్ స్టార్​ యశ్​, హనుమంతుడిగా బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ దేవోల్​ కనిపించనున్నారట. మరోవైపు కైకేయి పాత్రలో లారా దత్తా, విభీషణుడి పాత్రలో విజయ్ సేతుపతి నటించనున్నారని టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఈ స్టోరీలో కీలక పాత్ర అయిన సూర్పణఖ రోల్​లో ఎవరు కనిపించనున్నారన్న విషయంపై ఆసక్తి నెలకొంది.

ఇదే విషయానికి సంబంధించిన తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే శూర్పణఖ రోల్​లో బీటౌన్​ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనుందట. దీని కోసం ఇప్పటికే మూవీ టీమ్​ రకుల్​తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకూండా ఈ పాత్ర కోసం ఇప్పటికే రకుల్ లుక్ టెస్ట్​కు వెళ్లినట్లు సమాచారం. ఒకవేళ ఈ వార్త నిజమైతే పెళ్లి తర్వాత రకుల్ నటింటనున్న తొలి సినిమా ఇదే కావొచ్చని సినీ వర్గాల మాట.

Rakul Preet Singh Marriage : మరోవైపు పెళ్లి పనుల్లో రకుల్‌ సూపర్​ బిజీగా ఉంది. బాలీవుడ్​ నటుడు జాకీ భగ్నానీ ఆమె వివాహం ఫిబ్రవరి 22న గోవాలో జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ వేడుకకు సంబంధించిన పనులు మొదలయ్యాయని టాక్ నడుస్తోంది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరగనుందని, ఆ తర్వాత సినీ ప్రముఖుల కోసం ముంబయిలో రిసెప్షన్‌ ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం.

వెడ్డింగ్ డెస్టినేషన్​లో మార్పులు - ఆయన కోసమే రకుల్, జాకీ నిర్ణయం!

పెళ్లిపీటలెక్కబోతున్న రకుల్​ప్రీత్ సింగ్​!- వరుడెవరో తెలుసా?

Last Updated : Feb 10, 2024, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.