Rakhi Sawant Hospitalized : బాలీవుడ్ డ్యాన్సర్, హాట్ మోడల్ రాఖీ సావంత్ చాలా మందికి తెలిసే ఉంటుంది. పలు తెలుగు సినిమాల్లోనూ స్పెషల్ సాంగ్స్‌లో చిందులేసింది. ఎప్పుడు తన కామెడీతో నవ్విస్తూ, అలానే వివాదాలతో వార్తల్లో నిలిచే ఈ బ్యూటీ బాంబ్ ప్రస్తుతం హాస్పిటల్ బెడ్‌పై కనిపిస్తోంది. ఆమె చేతికి సెలైన్ పెట్టినట్టుగా కూడా కనిపిస్తోంది. దీంతో ఆమెకు ఏమైందా అని నెటిజన్లు, ఆమె అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు.
అయితే ఆమె గుండెకు సంబంధించిన సమస్యతో హాస్పిటల్లో జాయిన్ అయిందంటూ బీ టౌన్ మీడియా వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. కానీ ఆమె ఆరోగ్యం బాగానే ఉందని, పెద్దగా ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పినట్టుగా హిందీ మీడియా కథనాల్లో వార్తలు రాసి ఉన్నాయి. హిందీ పాపరాజీ వైరల్ భయానీ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాఖీ సావంత్ ఆస్పత్రి బెడ్‌పై ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసి ఈ విషయాన్ని తెలిపింది. అయితే రాఖీ సావంత్ ఇన్‌స్టాలో మాత్రం కొన్ని గంట క్రితం కూడా ఫన్నీ రీల్‌ను షేర్ చేసినట్టుగా కనిపిస్తోంది. నిన్నంతా ఆమె టవల్ ధరించి వింత వింత పోజులు ఇస్తూ, అలానే డిఫరెంట్ ఔట్ ఫిట్ ధరించి హంగామా చేసినట్టుగా ఆ ఇన్‌స్టా స్టోరీస్ చూస్తే తెలుస్తోంది.
కాగా, రాఖీ సావంత్ బాలీవుడ్లో ఫుల్ పాపులర్. ఫోటో గ్రాఫర్లతో ఆమె చేసే ఫన్, వారి కెమెరాలుకు రకరకాల ఔట్ఫిట్లను ధరించి ఆమె ఇచ్చే పోజులు ఎప్పుడూ ట్రెండింగ్ అవుతూనే ఉంటాయి. అలా తన భారీ అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్లను కవ్విస్తూ కూడా ఉంటుంది. ఉర్ఫీతో కలిసి ఆమె చేసే అల్లరి, వేసుకునే డ్రెస్సులపై ఎక్కువగా నెట్టింట్లో చర్చలు కూడా జరుగుతుంటాయి. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలోనూ రాఖీ సావంత్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆడియెన్స్‌ను తెగ నవ్వించింది. దీంతో బాగా కనెక్ట్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు తాజా విషయం తెలిసి రాఖీ సావంత్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
shamitha shetty hospitalized : మరో హీరోయిన్ శిల్పా శెట్టి చెల్లెలు, నటి షమితా శెట్టి కూడా అరుదైన వ్యాధితో ఆస్పత్రిలో చేరారు. గర్భాశయంలో తనకు వచ్చిన ఎండోమెట్రియోసిస్ అనే సమస్యకు సర్జరీ చేయించుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో బైట్‌ను రిలీజ్ చేశారు. ఈ వ్యాధిపై మహిళల్లో అవగాహన పెంచేలా మాట్లాడారు. కాగా, షమితా శెట్టి తెలుగులో పిలిస్తే పలుకుతా సినిమాలో నటించింది. అనంతరం బాలీవుడ్లో సెటిల్ అయిపోయింది.
బాలయ్య పెట్టిన ఆ ఒక్క మెసేజ్ - షోలోనే ఏడ్చేసిన యాంకర్ ఉదయభాను! - Balakrishna Udaya bhanu
మరో హాలీవుడ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన టబు - Tabu Hollywood Film